/rtv/media/media_files/2025/04/13/bAWl8Ge1OQgVm3MMnosD.jpg)
Elevator accident
Elevator accident :హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది.నగరంలోని సూరారంలో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. సూరారంలోని సాయి మణికంఠ రెసిడెన్సీలో లిఫ్ట్ మీద పడటంతో అక్బర్ పాటిల్ (39) అనే వ్యక్తి మృతిచెందాడు. అపార్ట్‌మెట్ లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ గుంతలోకి తలపెట్టినప్పుడు పైనుంచి ఒక్కసారిగా లిఫ్ట్ పడటంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..
ఇదిలా ఉండగా.. ఇటీవల అలాంటి ఘటనే మరొకటి మెహదీపట్నంలో చోటు చేసుకుంది. ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధి సంతోష్‌నగర్‌కాలనీలో నాలుగున్నరేళ్ల చిన్నారి సురేందర్ లిఫ్ట్‌లో ఇరుక్కుని మరణించడం స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటన ఈ ఏడాది మార్చి 15న చోటు చేసుకుంది. దుర్ఘటనపై పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శ్యామ్ బహదూర్ నేపాల్‌కు చెందిన వ్యక్తి. ఉపాధి కోసం ఏడు నెలల కిందట నగరానికి వచ్చాడు. ఆరు అంతస్తులున్న భవనంలో హాస్టల్ నిర్వహిస్తున్నారు. లిఫ్ట్‌పక్కనే ఉన్న చిన్నగదిలో శ్యామ్ బహదూర్ కుటుంబం ఉంటోంది. రాత్రి 10 గంటల టైంలో.. సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ టైంలో తలుపుల మధ్యకు వెళ్లగా.. పైన ఎవరో లిఫ్ట్ నొక్కారు. తలుపులు మూసుకుపోకముందే లిప్ట్ పైకి దూసుకెళ్లింది. దీంతో లిఫ్ట్‌లోనే ఆ పసిప్రాణం నలిగిపోయింది. ఇది మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి
ఇది కూడా చూడండి: AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…