/rtv/media/media_files/2026/02/18/fotojet-18-2026-02-18-11-47-20.jpg)
Rajya Sabha polls 2026
రాజ్యసభ(rajyasabha-seat) లో ఖాళీ అవుతున్న సభ్యుల ఎన్నికకు సంబంధించిఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈరోజు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు(rajyasabha-elections) జరగనున్నాయి. కాగా ఈ స్థానాలు ఏప్రిల్ నెల 2026లో వివిధ తేదీల్లో ఖాళీ కానున్నాయి. వీటిలో తెలంగాణ నుంచి 2 స్థానాలు కూడా ఉన్నాయి. ఈ రెండు స్థానాలకు సంబంధించి పదవీకాలం ఏప్రిల్ 9, 2026తో ముగుస్తుంది. వీటిని ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా తిరిగి భర్తీ చేయనున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/18/rajya-sabha-polls-2026-2026-02-18-11-48-22.jpeg)
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 9తో కేఆర్ సురేశ్‌రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీ కాలం పూర్తికాబోతోంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 చివరి తేదీ. 6న నామినేషన్ల పరిశీలన, 9న ఉపసంహరణకు చివరి గడువు. మార్చి 16న పోలింగ్ జరుగుతుంది(Telangana election notification). ఎన్నిక పూర్తయిన రోజు సా.5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడుతారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ఇలా
నోటిఫికేషన్ : ఈ నెల 26 (ఫిబ్రవరి 26, 2026)
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 5, 2026
నామినేషన్ల పరిశీలన: మార్చి 6, 2026
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: మార్చి 9, 2026
పోలింగ్ : మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు.
ఓట్ల లెక్కింపు: పోలింగ్ ముగిసిన వెంటనే...మార్చి 16 సాయంత్రం 5 గంటలకు
ఈ రాజ్యసభ ఎన్నికలు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల (MLAs) ఓట్ల ద్వారా నిర్వహిస్తారు. పోలింగ్ రోజే ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.
Also Read : ఐబొమ్మ రవికి బిగ్ రిలీఫ్.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు
స్థానాలు ఖాళీ అయ్యే రాష్ట్రాల వివరాలు (మొత్తం 37 సీట్లు):
తెలంగాణ: 2 స్థానాలు
మహారాష్ట్ర: 7 స్థానాలు
తమిళనాడు: 6 స్థానాలు
పశ్చిమ బెంగాల్: 6 స్థానాలు
బిహార్: 4 స్థానాలు
అస్సాం: 3 స్థానాలు
ఒడిశా: 3 స్థానాలు
ఛత్తీస్‌గఢ్: 2 స్థానాలు
హర్యానా: 1 స్థానం
హిమాచల్ ప్రదేశ్: 1 స్థానం
జీవన్ రెడ్డికి అవకాశం?
కాగా తెలంగాణలో ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని జగిత్యాల కు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నేత జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిన సమయంలో పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డి ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఆయనకు సీటు కేటాయించడం ద్వారా ఆయనను శాంతింప చేయాలని పార్టీ భావిస్తోంది.
Follow Us