Hyderabad: సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్జు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లిహిల్స్ లోని తన ఇంటి వద్దే చిక్కడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'పుష్ప2' సినిమా చూసేందుకు వచ్చిన మహిళా అభిమాని మరణించిన విషయం తెలిసిందే. మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 105 సెక్షన్ ప్రకారం నాన్ బెయిల్ కేసు నమోదైంది. BNS 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పదేళ్లపాటు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్@alluarjun #Pushpa2TheRule #Pushpa2 #AlluArjun #RTV pic.twitter.com/O72VNdVSw1 — RTV (@RTVnewsnetwork) December 13, 2024 ఇది కూడా చూడండి: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు..ఉల్లంఘిస్తే ఇక అంతే! చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ తరలింపు.. ఈ మేరకు పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న విడుదలవగా డిసెంబర్ 4న ప్రిమియర్ షో చూసేందుకు అల్జు అర్జున్ సంథ్య థియేటర్ వెళ్లాడు. ఈ క్రమంలోనే తమ అభిమాన హీరోను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే రేవతి అనే మహిళా తన కొడుకు, భర్తతో కలిసి సంథ్య థియేటర్ కు వచ్చారు. అయితే అభిమానుల తాకిడి ఎక్కువకావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, 7 ఏళ్ల శ్రీ తేజ్ కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్జు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జూబ్లిహిల్స్ లోని తన ఇంటి వద్దే చిక్కడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'పుష్ప2' సినిమా చూసేందుకు వచ్చిన మహిళా అభిమాని మరణించిన విషయం తెలిసిందే.#AlluArjun #Pushpa2TheRule… pic.twitter.com/cU99M28bdK — RTV (@RTVnewsnetwork) December 13, 2024 ఈ ఘటనపై స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు ఇస్తామని ప్రకటించాడు. పిల్లల చదువుకు అయ్యే ఖర్చు భరిస్తామన్నాడు. మరోవైపు ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయించిన బన్నీ.. సంధ్య థియేటర్ ఘటన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఈ ఘటనకు సంబంధించి తనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, ఈ కేసును కొట్టివేయాలని కోరాడు. పోలీసులకు, థియేటర్ యాజమాన్యానికి ముందే సమచారం ఇచ్చానని, ఇందులో తన తప్పేమీ లేదని వివరించాడు. ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇది కూడా చూడండి: తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి