తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ మరో కీలక బాధ్యత అప్పగించింది. త్వరలో జరగనున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆయనను స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. మొత్తం 40 మందిని ఢిల్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది హస్తం పార్టీ. స్లార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. ఇంకా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖు కు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా అవకాశం దక్కింది.
ఇది కూడా చదవండి: KCR: ఇది ముమ్మాటికీ కేసీఆర్ విజయమే.. ట్విట్టర్‌లో కవిత, హరీష్ సంచలన పోస్ట్!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన 20 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 16వ స్థానంలో, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ 17వ స్థానంలో, హిమాచల్ సీఎం సుఖు 15వ స్థానంలో నిలిచారు.#DelhiAssemblyElection #Hyderabad pic.twitter.com/hzdpun7nVI
— Pramod Chaturvedi (ANI) 🇮🇳 (@PramodChturvedi) January 19, 2025
ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ ఎన్నికలకు సంబంధించి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించామని.. ఇప్పుడు అసలు పార్టనర్ ఆప్ను ఢిల్లీలో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఎన్నికల హమీల పోస్టర్లను రేవంత్ విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: AP Politics: ఇదేం పద్ధతి.. చంద్రబాబు సీరియస్.. అమిత్ షా కీలక ఆదేశాలు!
హామీల అమలు బాధ్యత నాదే..
తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించామని.. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలను ఇస్తున్నామన్నారు. తెలంగాణలో రూ.21 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్.. ఇది తమ పార్టీ నిబద్ధతను తెలియజేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో యువతకు ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పిన సీఎం.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే హామీలు అమలు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.