Telangana : బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బాసర ఆర్జేయూకేటీలో తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి మంగళవారం తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాపూరావు బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ ఎంపీ సీటును గెలవడమే లక్ష్యంగా అక్కడ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది హస్తం పార్టీ. ఇందులో భాగంగానే ఈ చేరిక జరిగిందని తెలుస్తోంది.
అడవుల జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ జంతువులు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడపాదడపా అటవీ జంతువులు దాడులు చేస్తుండటంతో అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు గజ గజ వణికిపోతున్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇంకో సారి తన పేరు తీస్తే బాగుండదంటూ మహేశ్వర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో బుధవారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందంటూ సీబీఐ దర్యాప్తు జరిపేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణ మరో వారానికి వాయిదా వేసింది.
తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వచ్చే అవకాశం ఉందని చెప్పింది.
తెలంగాణ -ఛత్తీస్ ఘడ్ సరిహద్దు కాంకేర్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్‌ను ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ ఎన్కౌంటర్లకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అవుతుందని హెచ్చరించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది.