Ashu Reddy : నటి అషురెడ్డిపై రూ. 9.35 కోట్ల మోసం కేసు: పెళ్లి పేరుతో బురిడీ?

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నటి అషురెడ్డి (వెంకట అశ్వినిరెడ్డి కొయ్య) ,ఆమె కుటుంబ సభ్యులపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రూ.కోట్లు కాజేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.  

New Update
FotoJet - 2026-04-26T064447.738

Ashu Reddy

Ashu Reddy : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నటి అషురెడ్డి (వెంకట అశ్వినిరెడ్డి కొయ్య) ,ఆమె కుటుంబ సభ్యులపై సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు కేసు నమోదు చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, కోట్లాది రూపాయలు కాజేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి.  లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వై.వి. ధర్మేంద్రకు 2018లో అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువు పూర్తి చేసుకుని సినిమాల్లో అవకాశాల కోసం వచ్చానని చెప్పి ఆమె అతడితో స్నేహం పెంచుకుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు ధర్మేంద్ర కుటుంబం పేర్కొంది.

 ఆర్థిక అవసరాల నెపంతో అషురెడ్డి పలుమార్లు ధర్మేంద్ర నుంచి డబ్బులు తీసుకుంది.ధర్మేంద్ర డబ్బులతో కారు, బంగారం,పలు ఆస్తులను కొనుగోలు చేసి, వాటిని తన పేరుతోనే రిజిస్టర్ చేయించుకుంది. పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నామంటూ అషురెడ్డి కుటుంబ సభ్యులు పండితుడిని పిలిపించి హడావుడి చేశారని, ఆ తర్వాత ముఖం చాటేశారని ఫిర్యాదులో వెల్లడించారు. 2018 నుంచి 2025 వరకు నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాల రూపంలో మొత్తం రూ. 9.35 కోట్లు ధర్మేంద్ర నుంచి తీసుకున్నట్లు బాధితుడి తండ్రి యెనుముల సత్యనారాయణ పోలీసులకు తెలిపారు. అదనంగా అషురెడ్డి సోదరి కూడా రూ. 50 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు.పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమే కాకుండా, పెద్ద మొత్తంలో ఆస్తులను కాజేసిన ఈ వ్యవహారంపై CCS పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది.

వరుస వివాదాలు

కాగా, ఆషురెడ్డి పేరు గతంలోనూ కొన్ని వివాదాల్లో వినిపించిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన కేపీ చౌదరి అరెస్ట్‌ అయిన సందర్భంలో  ఆయన కాల్‌లిస్ట్‌లో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ఉండటం కలకలం రేపింది. ఆ లిస్టులో  బిగ్ బాస్ కంటెస్టెంట్‌, న‌టి ఆషు రెడ్డితో పాటు పలువురు నటుల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  వీరు కె.పి.చౌద‌రితో ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. పలు మీడియాలో కూడా వార్తలు రావ‌డంతో తమకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదంటూ ఆషూ రెడ్డితో పాటు పలువురు నటులు చెప్పుకొచ్చారు. 

ఇటీవల ఇంస్టాగ్రామ్  సబ్ స్క్రిప్సన్‌ పేరిట ఆషూ రెడ్డి మరోసారి వార్తాల్లో నిలిచారు. నటిగా, బిగ్ బాస్ ఫేమ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ బ్యూటీ, తన ఫాలోయర్స్ కోసం నెలకు రూ. 399 రుసుముతో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా ఓ  వీడియో రిలీజ్‌ చేసింది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను లాంచ్ చేసిన ఒక్క రోజులోనే ఆమెకు దాదాపు 700 మందికి పైగా సబ్‌స్క్రైబర్లు చేరారు. అయితే  సబ్ స్క్రిప్సన్‌ పేరుతో అశ్లీల చిత్రాలు, వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు నటులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు