Messi: మెస్సితో ఫొటో చాలా కాస్ట్లీ గురు...క్లిక్‌ మంటే రూ.10 లక్షలు కట్టాల్సిందే

ఫుట్‌బాల్‌ దిగ్గజం.. అర్జెంటీనాకు చెందిన లియోనెల్‌ మెస్సీ.. ది గోట్‌ ఇండియా టూర్‌-2025లో భాగంగా హైదరాబాద్‌ వస్తున్నారు. మెస్సి తో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవచ్చు. కానీ, ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని నిర్వహకులు తెలిపారు.

New Update
lionel messi

Messi:  A photo with Messi is very expensive, Guru...you have to pay Rs. 10 lakhs just to click itఈ నెల 13న హైదరాబాద్‌ వస్తున్న మెస్సీ  ఉప్పల్‌ స్టేడియంలో ఆ రోజు నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తలపడనున్నారు. 13వ తేదీన సింగరేణి ఆర్‌ఆర్‌-9, అపర్ణ జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఇందులో సింగరేణి జట్టు తరఫున సీఎం రేవంత్‌ రెడ్డి, అపర్ణ జట్టు తరఫున మెస్సీ ఆడుతారు.రాత్రి ఏడు గంటలకు మొదలయ్యే మ్యాచ్‌ 20 నిమిషాల పాటు జరుగుతుంది, మ్యాచ్‌ చివరి ఐదు నిమిషాల్లో సీఎం రేవంత్‌, సాకర్‌ దిగ్గజం మెస్సీ తమ జట్ల తరఫున బరిలోకి దిగుతారు.  

అయితే ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ వస్తున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (అర్జెంటీనా)తో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవచ్చు. కానీ, పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే. అవును ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి (అర్జెంటీనా)తో అభిమానులు ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవాలనుకుంటే  పెద్ద మొత్తంలో చెల్లించాల్సిందే. ఒక్క ఫొటోకు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని ‘ద గోట్‌ టూర్‌’ నిర్వాహక కమిటీ (హైదరాబాద్‌) సలహాదారు పార్వతిరెడ్డి వెల్లడించారు. ‘ఈ నెల 13న సాయంత్రం మెస్సి హైదరాబాద్‌లో అడుగుపెడతారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ‘మెస్సితో మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో ఆయనతో ఫొటోలు దిగొచ్చు. ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని నిర్వహకులు తెలిపారు. డిస్ట్రిక్ట్‌ యాప్‌లో ఆ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కేవలం 100 మందికి మాత్రమే ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుంది’ అని వెల్లడించడం గమనార్హం.

‘‘శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్‌ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి వస్తారు. మెస్సీతో పాటు అర్జెంటీనాకు చెందిన రోడ్రిగో డి పాల్‌, ఉరుగ్వేకు చెందిన లూయిస్‌ సువారెజ్‌ (ఉరుగ్వే) స్టేడియంలో సందడి చేస్తారు. ఇందులో భాగంగా సింగరేణి ఆర్‌ఆర్‌-9తో, అపర్ణ మెస్సి ఆల్‌ స్టార్స్‌ జట్టు 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. 15 మంది చిన్నారులు మ్యాచ్‌లో పాల్గొంటారు. అందులో ఐదుగురు శిక్షణ పొందినవారు. మిగతా 10 మంది ప్రతిభ ఉండి శిక్షణకు దూరమైన (అండర్‌ ప్రివిలేజ్డ్‌) పిల్లలు ఉంటారు. చివరి 5 నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మ్యాచ్‌లో బరిలో దిగుతారు. అనంతరం ఫుట్‌బాల్‌ క్లినిక్‌ ఉంటుంది. ఇందులో భాగంగా యునిసెఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ మెస్సి.. చిన్నారులకు ఫుట్‌బాల్‌ ఎలా నేర్చుకోవాలి? ఎలా ఆడాలి? ఏమేం చేయాలి? ఎలా ఆడాలి? అనే చిట్కాలు చెబుతారు. మెస్సి సమక్షంలో పెనాల్టీ షూటౌట్‌ నిర్వహిస్తారు. తర్వాత విజేతలకు మెస్సి బహుమతులు అందజేస్తారు. అనంతరం జరిగే పరేడ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మెస్సిని సన్మానిస్తారు. సుమారు గంట పాటు ఉప్పల్‌ స్టేడియంలో మెస్సి ఉంటారు. రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేసి..ఆదివారం ఉదయం ముంబయికి వెళ్తారు’ అని పార్వతిరెడ్డి వివరించారు. స్టేడియంలో 3 గంటల పాటు ఈవెంట్‌ ఉంటుందని, కార్యక్రమంలో భాగంగా మ్యూజికల్‌ కాన్సర్ట్‌ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

మ్యాచ్‌ అనంతరం ఇరు జట్లకు ‘ది గోట్‌ కప్‌’ను అందజేస్తామని తెలిపారు. ఈ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను చూడాలనుకునే వారి కోసం డిస్ట్రిక్ట్‌ యాప్‌లో టికెట్లు అందుబాటులో ఉంచామని పార్వతిరెడ్డి తెలియజేశారు. టికెట్‌ ప్రారంభ ధర రూ.1,300 అని కార్పొరేట్‌ బాక్సుల్లోని టికెట్ల ధర రూ.22 వేల నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌ విధానంలో టికెట్ల విక్రయం లేదని, ఆన్‌లైన్‌లో మాత్రమే కొనుగోలు చేయాలని ప్రేక్షకులకు సూచించారు. మ్యాచ్‌ను సోనీ లైవ్‌ ద్వారా స్ట్రీమింగ్‌ చేస్తున్నామని ప్రకటించారు.  

Advertisment
తాజా కథనాలు