/rtv/media/media_files/2025/03/16/gA39h0qVOJ2joSJhGqgy.jpg)
SUMMER rains
SUMMER : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎండలు తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వాతావరణం వేడి, వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈసారి వేసవి మరింత వేడి అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండే గరిష్ట స్థాయిని దాటినట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: లోన్ వస్తే నాతో ఎంజాయ్ చేయాలి.. టీడీపీ లీడర్ రాసలీలల ఆడియో లీక్!
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. దీనికి తోడు వడగాలులు కూడా తోడవడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు బయటకి వెళ్లడం మానుకొని ఇళ్లలో ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అవసరం ఉంటే తప్ప భయటకు రావద్దని.. ఒకవేళ బటయకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనికి తోడు రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతకు చేరే అవకాశం ఉందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Pawan kalyan: నేను హిందీని వ్యతిరేకించలేదు.. పవన్ సంచలన పోస్ట్!
ఇదిలా ఉండగా.. మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 21 నుంచి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించే అవకాశం ఉంది. మరోవైపు రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
ఇక.. ప్రజలు తప్పనిసరిగా ఎండకు వెళ్తున్నపుడు శరీరంపై నీళ్లు చల్లుకోవడం.. తాగడానికి వాటర్ బాటిల్ ను తీసుకెళ్లడం చేయాలని వాతావరణ శాఖ సూచించింది. ఎండలో ప్రయాణం చేసే వారు నెత్తికి రూమాలు చుట్టుకోవాలని.. టూ వీలర్ పై వెళ్లే వారు హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. ఎండాకాలంలో తరచుగా వడదెబ్బకు గురి అవుతుంటారు.. అలా కాకుండా ఉండాలంటే.. బాడీని డీ హైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?