/rtv/media/media_files/2025/02/12/gaDJTixp2Tx1wNjVmQ3t.webp)
Local Body Elections
దీంతో తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేసుకుంది. రెండు వారాల్లో ఎన్నికల తేదీల ప్రకటన ఉంటుందని ముందుగా ప్రాదేశిక ఎన్నికలు నిర్వహిస్తామని చేసిన ప్రకటనలు తుస్సుమన్నాయి. సీఎం రేవంత్ తో పాటు ముఖ్య నేతలు, అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ రోజు సమావేశం అయ్యారు. ఎన్నికల తేదీలపై ఓ క్లారిటీ వస్తుందనుకున్నారు. కానీ సమావేశం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మరోసారి కులగణన చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో అందరూ షాక్‌కు గురి కావాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Jagan Vs Sharmila: చెల్లికి చెక్.. జగన్ సంచలన వ్యూహం.. ఆ నేతలంతా వైసీపీలోకి..!
ఎన్నికల సమయంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ఆ హామీని నెరవేర్చడానికి సమగ్ర కుల గణన పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై అనేక ఆరోపణలు వినవస్తున్నాయి. కుల గణన సరిగా జరగలేదని కొన్ని సంఘాలు, తమ కులాన్ని తక్కువ చేసి చూపారని మరికొన్ని సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చాలామంది కులగణనలో పాల్గొనలేదని కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. కుల గణన తేలకుండా ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ వేసింది. బీసీ రిజర్వేషన్లు తేలిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ బడ్జెట్ సమావేశంలో చట్టం చేసి కేంద్రానికి పంపాలని భావిస్తోంది.
Also Read: Trump-musk: మస్క్ కు హై పవర్ ఇచ్చిన ట్రంప్...ఇక కోతలే..కోతలు!
కాగా కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 16 నుంచి 28 వరకూ ప్రభుత్వ సిబ్బంది కులగణన సర్వే నిర్వహించనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రభుత్వ సిబ్బంది కులగణన సర్వే నిర్వహించనుందని భట్టి తెలిపారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: తెలంగాణలో మళ్లీ కులగణన.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
కులగణన చాలా పక్కాగా జరిగిందని ప్రభుత్వం అదే పనిగా వాదిస్తోంది. అసెంబ్లీలో పెట్టి ఆమోదించుకుంది కూడా. ఆ నివేదిక ఆధారంగా బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కూడా సమర్పించింది. ఇప్పుడు మళ్లీ రీ సర్వే అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేక విమర్శలకు కారణమయ్యే అవకాశం ఉంది. కులగణన తప్పుల తడక అని తాము వాదించామని ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకుని మళ్లీ సర్వే చేస్తోందని ఇతర పార్టీలు వాదిస్తాయి. అయితే ప్రభుత్వం గతంలో కులగణనలో నమోదు చేసుకున్న వారికి మాత్రం కాదని.. మొత్తంగా 3.1 శాతం మంది నమోదు చేసుకోలేదని వారి కోసమేనని చెబుతోంది.అయితే ఇప్పుడు డబుల్ ఎంట్రీలు నమోదు చేయించుకుంటే పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే ఆధార్ కార్డు ఖచ్చితంగా ఇవ్వాలన్న రూల్ ఏమీ పెట్టుకోలేదు. ఫలితంగా నమోదు చేసుకున్న వారు.. చేసుకోని వారు ఎవరో అంచనా వేయడం కష్టమే. ఈ వ్యవహారం మరింత గందరగోళానికి దారి తీసే అవకాశం ఉంది. సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేని వారు. వారు ఇప్పుడు మళ్లీ సర్వే పెట్టినా వివరాలు ఇవ్వడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది.
Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!
బీసీ డిక్లరేషన్ ప్రకటించి స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీనే ఇప్పుడు కాంగ్రెస్ కు సమస్యగా మారింది. రాజకీయంగా ఆ రిజర్వేషన్లు ఇద్దామని రేవంత్ సవాల్ చేశారు కానీ.. అలా ముందుకు వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని.. మరో ప్రయత్నం చేద్దామని వాయిదా వేస్తున్నారు. గత ఏడాది నుంచి ..స్థానిక ఎన్నికలను రేవంత్ సర్కార్ ముందుకు జరుపుకుంటూ పోతోంది.
Also Read : కాపాడండయ్య నన్ను.. సైబర్ క్రైమ్ను ఆశ్రయించిన పృథ్వీ!
ఈ నెలంతా కులగణన జరగనుండగా మార్చి నెలలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చు. ఆ వెనువెంటే పదవతరగతి పరీక్షలు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు పదవతరగతి పరీక్షల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సర్పంచ్‌ల సంఘం కోరింది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది.
Also Read : స్వతంత్ర పోరాటంలో ఫ్రాన్స్ జ్ఞాపకాలను గుర్తు చేసిన మోదీ