Anganwadi Jobs:  మహిళలకు పండుగ ఒకేసారి 14,236 ఉద్యోగాల భర్తీ.. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయంటే..

తెలంగాణ ప్రభుత్వం మహిళా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. త్వరలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మొత్తం 14,236 అంగన్‌వాడీ పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు మంత్రి సీతక్క సంతకం చేశారు..

New Update
Anganwadi: నిరుద్యోగ మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ కేంద్రాల్లో 9వేల ఉద్యోగాలు!

Anganwadi Jobs

Anganwadi Jobs:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. త్వరలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మొత్తం 14,236 అంగన్‌వాడీ పోస్టులతో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయబోతోంది. మొత్తం 14,236 అంగన్‌వాడీ పోస్టులతో బిగ్‌ జాబ్‌ ఫెస్టివల్‌ సెలబ్రేట్‌ చేయబోతుంది. మొత్తం పోస్టుల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 6,399, హెల్పర్‌ పోస్టులు 7,837 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు.  తెలంగాణ జిల్లాల వారిగా భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య ఇలా ఉంది.

ఇది కూడా చూడండి: Almond Vs Coconut Oil: బాదం నూనె వర్సెస్‌ కొబ్బరి నూనె.. ఏది మంచిది?

ఆదిలాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 96, సహాయకుల పోస్టులు 406, కొత్తగూడెం జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 158, సహాయకుల పోస్టులు 826, హనుమకొండ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 37, సహాయకుల పోస్టులు 140, హైదరాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 130, సహాయకుల పోస్టులు 273, జగిత్యాల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 46, సహాయకుల పోస్టులు 172, జనగామ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 16, సహాయకుల పోస్టులు 75,భూపాలపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 31, సహాయకుల పోస్టులు 77, మహబూబాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 84, సహాయకుల పోస్టులు 318, మహబూబ్‌నగర్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 40, సహాయకుల పోస్టులు 119, మంచిర్యాల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 57, సహాయకుల పోస్టులు 257, మెదక్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 25, సహాయకుల పోస్టులు 266, మేడ్చల్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 51, సహాయకుల పోస్టులు 157, గద్వాల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 53, సహాయకుల పోస్టులు 177,కామారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 47, సహాయకుల పోస్టులు 269 పోస్టులున్నాయి.

Also Read: MAZAKA Trailer: నాన్న ఆంటీ.. కొడుకు అమ్మాయి.. నవ్వులే నవ్వులు 'మజాకా' ట్రైలర్! చూశారా

ఇక కరీంనగర్ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 50, సహాయకుల పోస్టులు 119, ఖమ్మం జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 93, సహాయకుల పోస్టులు 394, ఆసిఫాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 91, సహాయకుల పోస్టులు 261, ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 73, సహాయకుల పోస్టులు 233, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 103, సహాయకుల పోస్టులు 387, నల్గొండ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 88, సహాయకుల పోస్టులు 374,వికారాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 49, సహాయకుల పోస్టులు 238,వనపర్తి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 34, సహాయకుల పోస్టులు 112, వరంగల్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 35, సహాయకుల పోస్టులు 172, భువనగిరి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 40, సహాయకుల పోస్టులు 118, నారాయణపేట జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 29, సహాయకుల పోస్టులు 106, నిర్మల్ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 55, సహాయకుల పోస్టులు 276, నిజామాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 50, సహాయకుల పోస్టులు 290, పెద్దపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 37, సహాయకుల పోస్టులు 117, రాజన్నసిరిసిల్ల జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 21, సహాయకుల పోస్టులు 53, రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 46, సహాయకుల పోస్టులు 365, సంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 35, సహాయకుల పోస్టులు 274, సిద్ధిపేట జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 57, సహాయకుల పోస్టులు 145, సూర్యాపేట జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 61, సహాయకుల పోస్టులు 191 ఖాళీగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Rajinikanth Upcoming Movies: అదిదా రజినీ రేంజ్..! వరుస సినిమాలతో రప్ఫాడిస్తున్న తలైవా..

అయితే గతంలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు పొందాలంటే కనీసం పదో తరగతి పాసై ఉండాలి. కానీ ప్రస్తుతం కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్‌తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్‌ పాసైన అనుభవం ఉండాలి. దీంతో ఇంటర్మీడియట్‌ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది.

ఇది కూడా చదవండి: మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా?.. అయితే.. ఈ విషయం మీ కోసమే!
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు