Telangana: కేంద్ర వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ వక్ఫ్‌బోర్డు..

కేంద్రం తెచ్చిన వక్ఫ్‌ చట్టసవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు వ్యతిరేకించింది. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేనీ అధ్యక్షతన సోమవారం సమావేశం జరిగింది. కేంద్రం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లు వక్ఫ్‌ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు అభిప్రాయపడింది.

New Update
Telangana: కేంద్ర వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ వక్ఫ్‌బోర్డు..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ వ్యతిరేకించింది. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అజ్మతుల్లా హుస్సేనీ నేతృత్వంలో సోమవారం సమావేశం నిర్వహించారు. అయితే మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు వక్ఫ్‌ సంస్థలను దెబ్బతీసేలా ఉందని బోర్డు అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే దీనిని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఐదుగురు మృతి

మరోవైపు వక్ఫ్ చట్ట సవరణ బిల్లు తిరస్కరణకు మద్దతిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌కు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఓవైసీతో పాటు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు