రేవంత్‌ కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీ.. పోటీపడుతున్న 15 మంది

రేవంత్‌ కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉండగా ఈ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీగా పోటీ నెలకొంది. ఏకంగా 15 మందికి పైగా తమకే అవకాశం దక్కుతుందనే ఆశిస్తున్నారు. మరో వారం రోజుల్లో ఈ ఆరుగురిని మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశం ఉంది.

New Update
రేవంత్‌ కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీ.. పోటీపడుతున్న 15 మంది

6 MP Posts Are Vacant : తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వారం గడవకముందే పనుల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే శనివారం సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తో పాటు మరో 11మంది మంత్రులుగా ప్రమాణం చేయగా వాళ్లకు వివిధ శాఖలు కూడా కేటాయించారు. అయితే రేవంత్‌ కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీ ఉండగా త్వరలోనే 6గురిని మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఖాళీగా ఉన్న ఈ స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీగా పోటీ నెలకొంది. ఏకంగా 15 మందికి పైగా తమకే అవకాశం దక్కుతుందనే ఆశిస్తున్నారు. పలువురు ఎమ్మెల్యేలతోపాటు ఓడిన వాళ్లు, పోటీ కూడా చేయనివాళ్లు సైతం మంత్రి పదవి ఇస్తారనే ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఖమ్మం నుంచి ముగ్గురు, నల్గొండ నుంచి ఇద్దరు, కరీంనగర్‌(Karimnagar) నుంచి ఇద్దరు, వరంగల్‌ నుంచి ఇద్దరికి కేబినేట్‌లో చోటు దక్కింది. మెదక్‌, మహబూబ్‌నగర్‌ నుంచి ఒక్కొక్కరుగా ఉన్నారు. అయితే మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి మిగిలిన ఆరుగురిని ఎంపిక చేసే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నేతలను మంత్రిమండలికి పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా నల్గొండ జాల్లా నుంచి మరొకరికి అవకాశం ఇవ్వబోతున్నట్లు చర్చ నడుస్తోంది. ఇక మైనార్టీ కోటాలోనూ మంత్రి పదవి కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించని మైనార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మైనార్టీ కోటాలో ఆశిస్తున్న షబ్బీర్‌ అలీ, అజహరుద్దీన్, ఫిరోజ్‌ ఖాన్‌ మంత్రి పదవి ఆశిస్తున్నారు.

ఇదికూడా చదవండి : Rules for Undergarments: ఇదెక్కడి వింతరా అయ్యా.. డ్రాయర్స్ కోసం ప్రత్యేక చట్టాలు..

అలాగే ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి ఛాన్స్‌ ఇస్తారని, ఇందులో గడ్డం బ్రదర్స్‌లో ఒకరికి తప్పకుండా అవకాశం ఉండబోతున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీరితోపాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవులు ఆశిస్తున్నారు. వీరితోపాటు బీసీలకు ప్రాధాన్యమివ్వాలని భావిస్తే అద్దంకి దయాకర్‌, మధుయాష్కీ, అంజన్‌కుమార్‌ యాదవ్ ఒకరికి ఛాన్స్‌ ఉంటుంది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సహా పలువురు కీలక నేతలు మంత్రి పదవి ఆశిస్తున్నారు. వీళ్లంతా తమదైన స్టైల్‌లో లాబీయింగ్ చేస్తున్నారు. పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. అయితే జిల్లాలు, ప్రాంతాలు, సామాజికవర్గాల సమీకరణాల ఆధారంగానే మిగిలిన కేబినెట్ బెర్తులు భర్తీ చేసే ఆలోచనలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. వారం, పది రోజుల్లో పూర్తి కేబినెట్ కొలువుదీరే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు