UPSC: సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్‌.. ఎక్కడంటే

హైదరాబాద్‌లోని తెలంగాణ షెడ్యూల్‌ క్యాస్ట్‌ స్టడీ సర్కిల్ ఉచిత హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తోంది. ప్రతి ఏడాది 100 అడ్మిషన్లను తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. tsstudycircle.co.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జులై 31 చివరి తేది.

New Update
UPSC: సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్‌.. ఎక్కడంటే

సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ప్రతిరోజూ గంటల తరబడి చదవాల్సి ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించాలంటే సొంతంగా ప్రిపేర్ అవ్వడం కంటే కోచింగ్‌ తీసుకోవడం మంచిదని చాలామంది చెబుతుంటారు. ప్రైవేట్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో చూస్తే లక్షల్లో ఫీజులు ఉంటాయి. కోచింగ్ తీసుకోవాలనుకునే పేద, మధ్యతరగతి కుటుంబాల వాళ్లకి ఇది చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ షెడ్యూల్‌ క్యాస్ట్‌ స్టడీ సర్కిల్ ఉచితంగా హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తోంది.

Also Read: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్‌

ప్రతి ఏడాది 100 అడ్మిషన్లను తీసుకుంటారు. బెస్ట్‌ ఫ్యాకల్టీని ఇక్కడ బోధిస్తారు. స్టడీ హాల్, లైబ్రరీ, ఫ్రీగా బుక్స్‌ కూడా ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 17 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. జులై 31 చివరి తేది. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండి, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. బంజారాహిల్స్‌లో ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 10 నెలల పాటు ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. ఉచింతంగానే హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. tsstudycircle.co.inలో పూర్తి వివరాలు ఉంటాయి. ఆ వెబ్ సైట్‌లోనే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

Also read: అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ ను రద్దుచేస్తాం..అఖిలేష్ యాదవ్!

అయితే ఇక్కడ కోచింగ్ తీసుకోవాలంటే ముందుగా ఎంట్రన్స్ టెస్ట్‌ రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఆగస్టు 11న ఉదయం 10.30 నుంచి 1.30 మధ్యలో ఎంట్రన్స్‌ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష యూపీఎస్సీ ప్రీలిమ్స్‌ తరహాలో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఈ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఎంట్రన్స్‌ టెస్టులో వచ్చిన మార్కులను బట్టి రిజర్వేషన్‌ ప్రకారం కోచింగ్‌ సీట్లు కేటాయిస్తారు.

పరీక్ష విధానం..
పార్ట్ A లో 100 ఆబ్జెటీవ్ టైప్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
పార్ట్ B లో (C SAT) 40 ఆబ్జెటీవ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 1/2 మార్కులు.
రెండు పేపర్లలో 1/3 నెగిటివ్ మార్కులు ఉంటాయి. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.

Advertisment
Advertisment
తాజా కథనాలు