Viral Video : రీల్స్ కోసం నడిరోడ్డుపై యువతి పిచ్చి డ్యాన్స్.. వెర్రి చేష్టలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్! వీడియో వైరల్ కావాలన్న ఆలోచనతో ఓ యువతి ట్రాఫిక్ ఉన్న రోడ్డుపై డ్యాన్స్ చేసింది. వైరల్ గా మారిన ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ షేర్ చేశారు. నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనదంమో.. ఏమో!? అంటూ ఫైర్ అయ్యారు. By Nikhil 24 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Sajjanar : ఇటీవల అనేక మంది యువతకు ఇన్‌స్టా రీల్స్(Insta Reels), యూట్యూబ్ షార్ట్స్( Shorts) పిచ్చి పట్టుకుంది. సోషల్ మీడియాలో స్టార్స్ కావాలన్న లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేస్తున్నారు అనేక మంది. కొన్ని సార్లు ప్రమాదకర ప్రదేశాల్లో వీడియోలు చేస్తూ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల మీద వీడియలో చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు అనేకం. ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా ఓ యువతి నడి రోడ్డు మీద ట్రాఫక్ కున్న సమయంలో చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: AP Free Bus Scheme : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. న్యూ ఇయర్ నుంచే బస్సుల్లో ఫ్రీ జర్నీ? రోడ్డు మధ్యలోకి బ్యాగ్ తో మామూలుగా నడుచుకుంటూ వచ్చిన ఓ యువతి.. సడెన్ గా బ్యాగ్ ను విసిరేసి డ్యాన్స్ మొదలు పెట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డుపై పడుకుని కూడా స్టెప్పులు వేసింది. ఈ వీడియోను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) కూడా షేర్ చేశారు. 'నేటి యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకోవడం బాధాకరం. సమాజానికి పనికి వచ్చే పనులు చేసి నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన యువతరం.. సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే పాపులర్ కావడం కోసం నడి రోడ్డుపై ఇలాంటి వెర్రి చేష్టలు చేస్తూ.. ఇతరులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఏం ఆనదంమో.. ఏమో!?' అంటూ కామెంట్ చేశారు. నెటిజెన్లు కూడా ఈ వీడియోపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి పిచ్చి వేశాలు వేసే వారిపై న్యూసెన్స్ కేసు పెట్టాలంటూ కొందరు డిమాండ్ కూడా చేశారు. #tsrtc #youtube #sajjanar #insta-reels మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి