CV Anand : క్రిమినల్స్ పై ఉక్కుపాదం.. డ్రగ్స్ ను కంట్రోల్ చేస్తాం: హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్

క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన ప్రధాన లక్ష్యమన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన సీపీగా బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

New Update
CV Anand : క్రిమినల్స్ పై ఉక్కుపాదం.. డ్రగ్స్ ను కంట్రోల్ చేస్తాం: హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్

IAS Officer CV Anand : హైదరాబాద్ (Hyderabad) సీపీగా సీనియర్ ఐఏఎస్ అధికారి సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీగా రెండోసారి భాద్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి కృతజ్ఞతలు తెలిపారు. వినాయకచవితి, మిలాద్ ఉన్ నబి పండుగలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూస్తానన్నారు. గతేడాది కూడా రెండు పండుగలు ఒకేసారి వచ్చాయని గుర్తు చేశారు. అప్పుడు కూడా ఆయా పండుగలను ప్రశాంతంగా జరిపామన్నారు. ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉందన్నారు.

ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై సీరియస్ గా ఉందన్నారు. డ్రగ్స్, గంజాయి (Drugs - Ganja) నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది.. పార్ట్ ఆఫ్ పోలీసింగ్ అని వివరించారు. కానీ కొందరు దానిని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారన్నారు. క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపక తప్పదన్నారు.

Also Read : అలా చేసినందుకు..? శ్రద్ధాకు బాలీవుడ్ డైరెక్టర్ క్షమాపణలు.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Congress Politics: మీనాక్షికి బిగ్ షాక్ ఇచ్చిన సీనియర్లు.. హైకమాండ్ కు కంప్లైంట్!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను తొలగించాలని హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ ఫిర్యాదు చేశారు.

New Update

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు సీనియర్ నేతలు బిగ్‌షాక్ ఇచ్చారు. ఆమెను తొలగించాలంటూ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆమె వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందంటూ హైకమాండ్ కు మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ కంప్లైంట్ చేశారు. దీంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ను ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా? అన్న అంశం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. HCU భూముల విషయంలో మీనాక్షి నటరాజన్ ఏకంగా సెక్రటేరియట్లోని భట్టి విక్రమార్క ఛాంబర్ లో సమీక్ష నిర్వహించిన అంశంపై విమర్శలు వచ్చాయి. అనంతరం యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్ తో భేట కావడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. 

అందుకే సీనియర్లకు కోపం?

పార్టీలో అందరూ ఒకటే అనే సిద్ధాంతంతో మీనాక్షి పని చేస్తున్నారు. ఇది సీనియర్లకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. తమ సిఫారసులను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ టీమ్ లో మీనాక్షి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం ఉంది.

ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని.. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయడం అన్న లక్ష్యంగా మీనాక్సి నటరాజన్ ను తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించింది హైకామాండ్. అయితే.. ప్రస్తుతం సీనియర్లు ఆగ్రహంగా ఉన్న ఈ తరుణంలో ఆమెను కొనసాగిస్తారా? లేక పక్కకు పెడతారా? అన్న అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది.

(telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment