AV Ranganath: రంగనాథ్ హీరో.. జీహెచ్ఎంసీ జీరో..! హైడ్రా దూకుడుతో పోలీసోడికి జనం జేజేలు హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌కు పేద ప్రజలు జేజేలు కొడుతున్నారు. అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్న పోలీస్ అధికారి నిజాయితిపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా లక్ష్యం నెరవేరుతుందని రేవంత్ సర్కార్ బలంగా నమ్ముతోంది. రంగనాథ్ రికార్డ్స్ ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 24 Aug 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి HYDRA: ఏవీ రంగనాథ్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్న పేరు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కబ్జాలకు పాల్పడి కట్టడాలు నిర్మించిన వారికి రంగనాథ్ పేరు వింటేనే చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు తమ అక్రమ ఆస్తుల మీద పడి కూల్చేస్తాడోననే భయంతో వణికిపోతున్నారు. అనుమతి లేని, కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను ఆక్రమించిన కట్టడం ఏదైనా సరే దానిని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్న పని. కాగా హైడ్రా చీఫ్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌కు పవర్ ఫుల్ ఐపీఎస్‌గా పేరుండటంతో తలలు పట్టుకుంటున్నారు. గతంలో మార్కాపురం, కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సల్స్‌ను అణిచివేయడంలో తమ స్పెషల్ మార్క్ చూపించారు రంగనాథ్. ఇప్పుడు రంగనాథ్ పవర్ తెలిసిన అక్రమార్కులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుందని రేవంత్ సర్కార్ కూడా బలమైన నమ్మకంతో ఉంది. ఇంతకు రంగనాథ్ బ్యాక్ గ్రౌండ్, సర్విస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా.. ఆవుల వెంకట రంగనాథ్ 1996లో గ్రూప్-1లో టాప్ ర్యాంక్ సాధించి పోలీస్ బాస్ కావాలనే కతలో డీఎస్పీ ఆప్షన్ ఖరారు చేసుకున్నారు. అలా మొదటి పోస్టింగ్ లోనే 2000 సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ గా విధులు నిర్వర్తించారు. కొత్తగూడెం, మార్కపురంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేయడం మొదలుపెట్టారు. విజయవాడలో పనిచేస్తున్న టైమ్ లో ఆయేషా హత్య కేసును చేధించి సంచలనం సృష్టించారు. ఖమ్మం ఎస్సీగా ఉన్నప్పుడు భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్.. హైదరాబాద్ లో పెను సంచలనాలు క్రియేట్ చేశారు. పలు ప్రాంతాల్లో సిగ్నల్స్ తీసేసి యూ టర్న్ లు ఏర్పాటు చేయించారు. మలక్ పేట్ రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు విస్తరణ చేపట్టారు. ఈ క్రమంలోనే నల్గొండలో బొడ్డుపల్లి శ్రీను మర్డర్ తర్వాత శాంతి భద్రతలు దెబ్బతినడంతో మళ్లీ నల్గొండకు వెళ్లి తన మార్క్ చూపించారు. వరంగల్ జిల్లాలో పాలాభిషేకాలు.. వరంగల్ పోలీస్ కమీషనర్ రేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన రంగనాథ్ కు పాలాభిషేకాలు చేశారు. కానీ ఆయన ఇదంతా తన బాధ్యతగా భావించి, పాలాభిషేకాలు వద్దని పిలపునిచ్చారు. నర్సంపేటలోనూ వైఎస్ షర్మిల గొడవ తర్వాత కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. నల్గొండ టెన్ట్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ అరెస్ట్ తో సంచలనం క్రియేట్ చేశారు. గంజాయి స్మగ్లర్లకు కంటిమీద కునుకు లేకుండా చేసిన రంగనాథ్.. ఏవోబీలోనూ కీలకంగా వ్యవహరించారు. అయేషా, అమృత ప్రణయ్ కేసులోనూ రంగనాథ్ తన ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఎలక్షన్ కమీషన్ రంగనాథ్ ను హైదరాబాద్ బదీలి చేయగా.. రేవంత్ సర్కార్ కొత్తగా క్రియేట్ చేసి హైడ్రాకు రంగనాథ్ ను చీఫ్ గా నియమించింది. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించేవరకూ చిత్త శుద్ధితో పనిచేయడం తన నైజంగా రంగనాథ్ చెబుతుంటారు. అదే ఆత్మవిశ్వాసంతో తాను గ్రూప్-1 ఆఫీసర్‌గా విజయం సాధించానని, ఏదైనా పనిని ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తానని చెబుతున్నారు. మావోయిస్టులతో చర్చలకు స్థానిక అధికారిగా.. కొత్తగూడెంలో 2003 వరకూ పనిచేసి ఆ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేట డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మావోయిస్టుల అడ్డా ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మావోయిస్టులతో చర్చలను స్థానిక అధికారిగా స్వాగతించారు. తర్వాత బలిమెల రిజర్వాయర్ వద్ద నక్సల్స్ చేతిలో గ్రేహౌండ్స్ బలగాలు చనిపోవడంతో రంగనాథ్‌కు ఆ ప్రాంతం బాధ్యతలు అప్పగించారు. గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించిన రంగనాథ్ కు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు ఇచ్చింది ప్రభుత్వం. ఖమ్మం ఎస్పీగా పనిచేసి 2014 అక్కడినుంచి నల్లగొండకు బదిలీ అయిన ఆయన.. ఇప్పడు హైడ్రా చీఫ్‌గా తన మార్క్ చూపిస్తున్నారు. నిజాయితిగల ఆఫీసర్ అంటూ జనం జేజేలు.. అయితే గత ప్రభుత్వం తమకు మద్ధతుగా ఉన్న బడా బాబులు, వ్యాపారవేత్తలు, సినీనటుల అక్రమ కట్టడాలకు అడ్డు చెప్పకపోగా అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చిందని జనాలు వాపోతున్నారు. పార్టీఫండ్స్ కోసం కొంతమంది భూ కబ్జాలను చూసిచూడనట్లు వవ్యహరించడమే కాకుండా పేదల కట్టడాలను కూల్చి నీడ లేకుండా చేశారంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ రేవంత్ సర్కార్ అలా చేయకుండా ముందుగా అవినీతిపరుల ఆటకట్టిస్తోందని, రంగనాథ్ లాంటి నిజాయితిగల ఆఫీసర్ ఉండటం స్వాగతించాల్సివిషయమంటూ రంగనాథ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రంగానాథ్ హీరో, జీహెచ్ఎంసీ జీరో అంటూ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదులు అందినప్పటికీ కూల్చివేతలకు బ్రేక్ పడింది. కానీ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా నటుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది. హైడ్రా చీఫ్ రంగనాథ్ కు సీఎం రేవంత్ ఫుల్ రైట్స్ ఇవ్వడంతో తనదైన ముద్ర వేసేందుకు రంగనాథ్ సిద్ధంగా ఉన్నారు. ఎంతటివారైనా సరే వెనక్కుతగ్గే ప్రసక్తే లేదని, సినీ ప్రముఖుల కట్టడాలను కూల్చే దిశగా దూసుకెళ్తున్న రంగనాథ్ కు జనం జేజేలు కొడుతున్నారు. రంగనాథ్ లిస్టులో మరింత మంది రాజకీయ, సినీ, వ్యాపారాలకు సంబంధించిన బడా బాబులున్నట్లు తెలుస్తోంది. #hydra #av-ranganath #cm-ravanth మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి