తెలంగాణలో పేదలకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు?

తెలంగాణలో 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్తగా ఏర్పడబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాలు ఆశలు పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీలతోపాటు ఈ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.

New Update
తెలంగాణలో పేదలకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు?

Good News For Telangana Backward Peoples : తెలంగాణ రాష్ట్రం (Telangana)లో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ ప్రభుత్వం అడపాదడపా కొన్ని కార్డులను జారీ చేసి చేతులు దులిపేసుకుంది. దీంతో కొత్తగా పెళ్లైన జంటలు, తమకు పుట్టిన పిల్లల పేర్లను కార్డులో చేర్చేందుకు నోటిఫికేషన్ ఎప్పుడు ప్రకటిస్తారనే అని ఎదురు చూసి చూసి తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress)ప్రభుత్వం కొలువుతీరనుండగా కొత్త రేషన్ కార్డుల జారీ అంశం తెరపైకి వచ్చింది. ఆరు గ్యారంటీ పథకాలతోపాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తుందని అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ గృహ నిర్మాణం, ‘గృహజ్యోతి, యువ వికాసం, చేయూతపేరుతో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ గ్యారంటీలను హామీలుగా కాకుండా చట్టలుగా అమలు చేస్తామని ఇప్పటికే రాహుల్ గాంధీ సైతం ప్రజలకు మాటిచ్చారు. ఇందులో భాగంగానే తదితర పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తామని, తెల్ల రేషన్ కార్డులు కూడా జారీ చేస్తామని నాయకులు ఎన్నికల ప్రచారంలోనూ చెప్పారు. దీంతో ఈ కొత్త గవర్నమెంట్ లో ఎలాగైనా తమకు రేషన్ కార్డు వస్తుందని జనాలు ఆశిస్తున్నారు. అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్త ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీతోపాటు మహిళలకు రూ.2,500, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు 5లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా పథకాల లభిస్తాయని అనేక మంది మీసేవాల్లో కొత్తకార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంనేందుకు పడిగాపులు కాస్తున్నారు. అయితే కాంగ్రెస్ సన్నిహితుల సమాచారం ప్రకారం మంత్రి వర్గం ఏర్పడగానే దీనిపై చర్చ జరగబోతున్నట్లు తెలుస్తోంది. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలతోపాటు తెల్ల రేషన్ కార్డులపై కూడా ప్రస్తావిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : ఆ రికార్డ్ దరిదాపుల్లోకి కూడా కోహ్లీ రాలేడు.. లెజెండరీ ప్లేయర్ కామెంట్స్

ఇదిలావుంటే.. ఇప్పటికే హైదరాబాద్‌ (Hyderabad)జిల్లాలో 6,36,698, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 7.8లక్షల మంది కార్డుదారులున్నారు. పాతకార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చడానికి వీలుగా పౌరసరఫరాలశాఖకు హైదరాబాద్‌ జిల్లాలో 1,28,205 దరఖాస్తులు అందాయి. తిరస్కరించినవీ, పరిశీలించినవి పోను 74,802 పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డిలో 50వేలు, మేడ్చల్‌లో 40వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. రీసర్వే చేసినా.. పదేళ్లలో వేర్వేరు కారణాలతో అనర్హులుగా గుర్తించిన అధికారులు మూడు జిల్లాల్లో 2.8లక్షల కార్డులు తొలగించారు. వారంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం మరోసారి రీసర్వే చేసి అర్హులకు కార్డులు మంజూరు చేయాలంటూ గతేడాది జులైలో ఆదేశించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!

మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. HCU భూముల విషయంలో రేవంత్ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ చేశారన్న చర్చ సాగుతోంది.

New Update

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు.

తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన X ఖాతాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు.

అయితే... విజయశాంతి ట్వీట్‌ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. HCU వివాదం నేపథ్యంలో రేవంత్‌కు విజయశాంతి గట్టి కౌంటర్‌ ఇచ్చారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ కూడా HCU భూములపై రియాక్ట్‌ కాగా.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ కూడా రేవంత్‌ చర్యలు సరికావని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం... పచ్చకామెర్ల రోగికి అన్నీ పచ్చగా కన్పించినట్లు.. గులాబీ నేతలకు పవరే కాదు... బుర్రలో చిప్‌ కూడా దొబ్బిందని ఘాటుగా స్పందిస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రతీ దానికి రేవంత్‌కు ముడిపెట్టడం... కామన్‌ అయిపోయిందని విమర్శిస్తున్నారు. 

(vijayashanthi | telugu-news | telugu breaking news | hcu land )

Advertisment
Advertisment
Advertisment