Heavy Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రంగంలోకి జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లోని పలుచోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, జూబ్లీహిల్స్‌, మైత్రీవనం, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update
Telangana : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!

హైదరాబాద్‌లోని పలుచోట్ల గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, జూబ్లీహిల్స్‌, మైత్రీవనం, అమీర్‌పేట, పంజాగుట్ట, రామంతాపూర్‌, ఉప్పల్‌, దిల్‌షుఖ్‌ నగర్, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, బషీర్ బాగ్ , అబిడ్స్ , కోఠి , నాంపల్లి , బేగంబజార్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగింది.

Also Read: అయోధ్యలో దంచికొట్టిన వానలు.. ఇబ్బందుల్లో భక్తులు

పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు . డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు