TSPSC: హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ డేట్ వచ్చేసింది! హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. 581 ‘హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్' గ్రేడ్ 1, 2 కేటగిరీల పోస్టులకు సంబంధించిన పరీక్షలను జూన్ 24 నుంచి నిర్వహించబోతున్నట్లు తెలిపింది. అలాగే డీఏఓ ఎగ్జామ్స్ కూడా జూన్ 30 నుంచి ఉంటాయని ప్రకటించింది. By srinivas 13 Mar 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి TSPSC Hostel Welfare Officer: ఎప్పుడెప్పుడా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న హాస్టల్ వార్డెన్ అభ్యర్థులకు ఎట్టకేలకు తీపి కబురు అందింది. దాదాపు రెండేళ్ల నీరిక్షణకు తెరపడింది. వాయిదాలమీద వాయిదా పడుతూ వస్తున్న పరీక్షలు త్వరలోనే నిర్వహించబోతున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అంతేకాదు వీటితో పాటు డీఏఓ ఎగ్జామ్స్ కు సంబంధించిన వివరాలను కూడా విడుదల చేసింది. జూన్ 24 నుంచి.. ఈ మేరకు హాస్టల్ వార్డెన్ పోస్టులకు జూన్ 24 నుంచి, డివిజనల్ అకౌంట్స్ అధికారి (DAO)-గ్రేడ్ 2 పోస్టులకు జూన్ 30నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గిరిజన, ఎస్సీ, బీసీ, మహిళా-శిశు సంక్షేమ శాఖల్లో 581 ‘హాస్టల్ వెల్ఫేర్ అధికారి(వార్డెన్)- గ్రేడ్ 1, 2 కేటగిరీల పోస్టుల భర్తీకి 2022 డిసెంబరు 23న నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. కాగా వార్డెన్ పోస్టులకు దరఖాస్తు చేసినవారికి వచ్చే జూన్ 24 నుంచి పరీక్షలు ప్రారంభిస్తామని, ఏ రోజు ఏ పోస్టుకు పరీక్ష ఉంటుందనే వివరాలను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.\ ఇది కూడా చదవండి: TS DSC 2024: ఈ బుక్స్ చదివితే టీచర్ ఉద్యోగం పక్కా.. లిస్ట్ ఇదే! డీఏఓ పోస్టుల భర్తీ.. అలాగే వర్క్స్ అకౌంట్స్ శాఖలో 53 డీఏఓ పోస్టుల భర్తీకి 2022 ఆగస్టు 4న నోటిఫికేషన్ జారీచేసినట్లు తెలిపింది. పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 అర్థమెటిక్ పరీక్షలు రాయాలని సూచించింది. ఇక దరఖాస్తుదారులకు హాల్‌టిక్కెట్లను పరీక్ష తేదీలకు వారం ముందు కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచబోతున్నట్లు స్పష్టం చేశారు. దీంతో నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. #telangana #june-24 #hostel-welfare-officer #exams సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి