Runa Mafi: రుణమాఫీ కానివారికి శుభవార్త.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్! సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారికోసం నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి అర్హులందరి రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. By srinivas 13 Aug 2024 in బిజినెస్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana: తెలంగాణ రుణమాఫీపై రేవంత్ సర్కార్ మరో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రెండు దశల్లో రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) చేసిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం మరో రెండు రోజుల్లో మూడో దశతో ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. ఈ సందర్భంగా పలు కారణాలతో రుణమాఫీ కానీ రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శుభవార్త చెప్పారు. అర్హులైన వారికి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానియెడల నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. అర్హుల వివరాలు సేకరించి న్యాయం చేస్తాం.. ఇప్పటికే మొదటి దశలో లక్ష, రెండో దశలో లక్షన్నర మాఫీ చేసిన ప్రభుత్వం.. మూడో దశలో రెండు లక్షల రుణాలను మాఫీ చేయనుంది. అయితే మొదటి రెండు దశల్లోనూ పలు సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. అక్షరం తప్పుగా ఉన్నా, పాస్ పుస్తకంలో చిన్న చిన్న మార్పులు, ఉమ్మడి కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకుండా పెండింగ్ లో ఉండటం, కొత్తగా పెళ్లైన వారి రేషన్ కార్డుల్లో మార్పులు, తల్లిదండ్రుల పేర్లమీదున్న భూములు, పట్టాదారు చనిపోవడం వంటి వాటిని పరిగణలోకి తీసుకుని అధికారులు రుణమాఫీ చేయలేదు. ఈ నేపథ్యంలో అర్హులైనప్పటికీ తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పలుచోట్ల నిరసనలు చేపట్టారు. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. తప్పకుండా అర్హుల వివరాలు సేకరించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చింది. సాకులు చెబుతున్నారంటూ బీఆర్ఎస్ ఆగ్రహం.. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రుణమాఫీ చేయకుండా సాకులు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగస్టు 15లోపై రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ సైతం దీనిపై విమర్శలు గుప్పించారు. ఏకంగా ఈ సమస్యలపై ఫిర్యాదులు సేకరించేందుకు బీఆర్ఎస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇది కూడా చదవండి: Kolkata Murder: హింసాత్మక పోర్న్ చూస్తూ ట్రైనీ డాక్టర్ మర్డర్.. పోస్ట్‌మార్టంలో భయంకర నిజాలు! అయితే మంగళవారం రుణమాఫీ అందని రైతులు ఆందోళన చెందొద్దని, అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా హరీశ్‌రావు చేసిన విమర్శలపై స్పందించిన పొన్నం.. హరీశ్‌రావు ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు పలు కారణాలు సాకుగా చూపి 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో పంటల బీమా లేక, పరిహారం అందక ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మండి పడ్డారు. కలెక్షన్ సెంటర్లు కాకుండా అప్పుడే ఈ కాల్‌సెంటర్లు పెడితే రైతులకు మేలు జరిగేదని విమర్శలు గుప్పించారు. #congress #rythu-runa-mafi #ponnam-prabhakar #farmer-loan-waiver మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి