Telangana:తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..పంటలకు బీమా ఇచ్చే యోచనలో గవర్నమెంట్ తెలంగాణ రైతుల మీద వరాల జల్లులు కురిపించడానికి రెడీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం.వచ్చే వానాకాలం సీజన్ నుంచి క్వింటా వరికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు...పంటల బీమా పథకం మీదనా కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. By Manogna alamuru 05 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Good News For Farmers:అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త చెప్పనుంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రైతులకు భారీగా ఊరట లబించనుంది. ఇప్పటికే వచ్చే వానాకాలం నుంచి క్వింటా వరికి 500 రూ. బోనస్ ఇస్తామని ప్రకటించిన వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మరి కొన్ని రోజుల్లో మరో శుభవార్త చేప్తానని అన్నారు. బోనస్‌లు, రుణమాఫీలతో పాటూ ప్రకృతి వైరిత్యాలు, ఇతర సంక్షోభాల వలన పంటలు నష్టపోతే రైతులకు బీమా ఇస్తామని చెబుతున్నారు. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని మంత్రి తుమ్ముల తెలిపారు. అంతేకాదు నెక్ట్స్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు. గ్లోబల్ రైట్ సమ్మిట్ బ్రోచర్‌ను మంత్రి తుమ్మల ఆదివారం ఆవిష్కరించారు. Also Read:Jharkhand:జార్ఖండ్ రాజకీయ సంక్షోభానికి తెర..విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్ రైతు బంధుకే తొలి ప్రాధాన్యం... మరోవైపు రాష్ట్రంలో రైతు బంధు పథకానికి తొలి ప్రాధాన్యత ఇచ్చి రైతుల ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్ధికశాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అందాయి. మిగిలిన వారి ఖాతాల్లో కూడా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది. మరో వైపు ఏపీ సర్కార్ కూడా మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన అన్నదాతలకు సబ్సిడీ డబ్బులు అందించేందుకు రెడీ అవుతోంది. ఈ నెలలోనే ఆ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నెలాఖరులోగా పీఎం కిసాన్ యోజన.. ఇక కేంద్రం కూడా రైతుల పట్ల సానుకూలంగా ఉంది. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈనెలలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద డబ్బులను రైతుల ఖాతాల్లో వేయనుంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లి పీఎం కిసాన్ 16వ విడత డబ్బులను రైతన్నల కాతాల్లో జమ చేయనుంది. ఈ విడత కూడా వస్తే అన్నదాతలకు మొత్తంగా రూ.32 వేలు వచ్చినట్లు అవుతుంది. #farmers #government #telanagana #cogress #good-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి