TS Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలివ్వాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

New Update
Telangana : రాష్ట్రంలో నేటి నుంచి పాలిటెక్నిక్‌ వెబ్‌ కౌన్సెలింగ్‌

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్‌ అయినప్పటికీ వివిధ శాఖలు, బోర్డులు, కార్పొరేషన్లలో కొనసాగుతున్న అధికారుల వివరాలపై ఆరా తీస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్టు ఇవ్వాలని సీఎస్ శాంతి కుమారి (CS Shanthi Kumari) అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్కియాలజీ, MCHRD, దేవాదాయ శాఖల్లో రిటైర్డ్‌ అయినప్పటికీ పలువురు అధికారులు పదవిలో కొనసాగుతున్నట్లు సమాచారం. వారిని కొత్త ప్రభుత్వం తొలగించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి: తమ్మినేని వీరభద్రం హెల్త్ బులిటెన్!

వేగవంతం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

రీజనల్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలి అని తేల్చి చెప్పారు. భూ సేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌(ఉత్తరం) పనులకు టెండర్లు పిలవాలని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని ఎన్‌హెచ్‌గా ప్రకటించాలని ఎన్‌హెచ్‌ఏఐని కోరారు సీఎం రేవంత్. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగం తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

లక్ష్యాలు సాధించవచ్చు: రేవంత్ రెడ్డి

దావోస్‌లో (Davos) ప్రపంచ ఆర్థిక ఫోరం (World Economic Forum) అధ్యక్షుడితో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. 4వ పారశ్రామిక విప్లక కేంద్రం.. సీ4ఐఆర్‌ ఏర్పాటుపై సంయుక్త ప్రకటన చేశారు. బయోఏషియా సదస్సులో ఫిబ్రవరి 28న సీ4ఐఆర్‌ ప్రారంభం కానుంది. ప్రపంచ ఆర్థిక ఫోరం లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యంతో వేగంగా లక్ష్యాలు అందుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజారోగ్యం, సాంకేతికత, నాణ్యమైన జీవిత లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు.

ఇది కూడా చదవండి ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల.. వైసీపీ నేతల రియాక్షన్!

DO WATCH THIS:

Advertisment
Advertisment
తాజా కథనాలు