TS NEWS: ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. ప్రోటోకాల్ -పబ్లిక్‌ రెలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావుని నియమించారు.

New Update
TS NEWS: ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం..!

Telangana Latest News: ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం సలహాదారు (పబ్లిక్ అఫైర్స్)గా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని నియమించగా.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. SC, ST, BC, మైనారిటీ శాఖలకి సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉండనున్నారు. తెలంగాణ ప్రభుత్వ (ప్రోటోకాల్ -పబ్లిక్‌ రెలేషన్స్)సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావుని నియమించారు.

వేం నరేందర్ రెడ్డి క్లిక్

షబ్బీర్ అలీ క్లిక్

హర్కర వేణుగోపాల్ రావు క్లిక్

స్నేహం కోసం:
తొమ్మిదేళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు సమయంలో తెలంగాణలో మారుమోగిన పేరు వేం నరేందర్ రెడ్డి. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేతగా, మాజీ ఎమ్మెల్యేగా సేవలందించిన వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. సీఎం సలహాదారుగా రేవంత్‌ తన స్నేహితుడినే ఎన్నికున్నారు. టీపీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న వేం నరేందర్ రెడ్డితో రేవంత్‌ స్నేహం ఈనాటిది కాదు. టీడీపీలో కలిసి ఉన్న సమయంలో రేవంత్ నరేందర్ మధ్య దాదాపు 17 ఏళ్ల స్నేహం ఉంది. 2004 నుంచి 2009 మధ్యకాలంలో మాహబూబాబాద్ ఎమ్మెల్యేగా వేం నరేందర్ రెడ్డి సేవలందించారు. 2007లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. 2015లో తన స్నేహితుడు నరేందర్‌ను ఎమ్మెల్సీ స్థానానికి గెలిపించాలని రేవంత్ ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రేవంత్‌ సంప్రదించడం ప్రకంపనలు రేపింది. ఇది ఆయన అరెస్టుకు దారి తీసింది. ఆ తర్వాత ఎదురైన ఒడిదుడుకుల సమయంలో రేవంత్‌కు నరేందర్ అండగా నిలిచారు. ఇద్దరు ఒకేసారి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
Also Read: కేసీఆర్‌ మద్యానికి బానిసలను చేసిండు.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేయాల్సిందిదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు