Dubbaka Elections: దుబ్బాకలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్.. ఎమ్మెల్యేగా గెలిచి నిలిచేదెవరు?!

తెలంగాణ ఎన్నికల్లో దుబ్బాక ఈసారి హాట్ ఫేవరెట్‌గా నిలవనుంది. బీజేపీ ఫైర్ బ్రాండ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

New Update
Dubbaka Elections: దుబ్బాకలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్.. ఎమ్మెల్యేగా గెలిచి నిలిచేదెవరు?!

Dubbaka Constituency Report: నవంబర్ 30వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ(Telangana Elections) ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచార పర్వంలో దూకుడు పెంచారు. తెలంగాణ కొన్ని నియోజకవర్గాలు హాట్ ఫేవరెట్ అని చెప్పాలి. అలాంటి వాటిలో దుబ్బాక(Dubbaka) నియోజకవర్గం ఒకటి. మరి ఈ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ పార్టీ అభ్యర్థి బలం ఎంత? ఎవరు గెలిచేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయి? వంటి ఇంట్రస్టింగ్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈసారి దుబ్బాక ఎన్నికల పోటీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు ఉన్నారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి..

ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలుస్తున్నారు. 2007లో ఉద్యమానికి ఆకర్షితులైన కొత్త ప్రభాకర్ బీఆర్ఎస్(నాటి టీఆర్ఎస్)లో చేరారు. అప్పటి నుంచి పార్టీ అధినేత కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. మెదక్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను. 2009లో దుబ్బాక ఉప ఎన్నికల్లో టికెట్ ఆశించిన కొత్త ప్రభాకర్‌కు నిరాశే ఎదురైంది. కానీ, 2014లో కేసీఆర్ గజ్వేల్ బరిలో నిలవగా.. ఆయన విజయానికి కొత్త ప్రభాకర్ కృషి చేశారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా, మెదక్ ఎంపీగా రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. అయితే, కేసీఆర్ రెండు చోట్లా గెలవడంతో ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త ప్రభాకర్‌కు ఛాన్స్ ఇవ్వగా.. ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయనకు దుబ్బాక టికెట్ కేటాయించింది బీఆర్ఎస్. దుబ్బాక కూడా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కావడంతో ఆయనకు అక్కడ మంచి పట్టు ఉంది. ఎంపీగా దుబ్బాక అభివృద్ధికి కొత్త ప్రభాకర్ చేసిన పనులు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సహా అనేక అంశాలు తనకు కలిసి వస్తాయని ఆశిస్తున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి.

చెరుకు శ్రీనివాస్ రెడ్డి..

చెరుకు శ్రీనివాస్ రెడ్డి తండ్రి కాంగ్రెస్ సీనియర్ నేత ముత్యం రెడ్డి. తండ్రి మరణానంతరం ఆయన ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి. 2006 నుంచి నియోజకవర్గం పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అప్పులతో ఆత్మహత్య చేసుకున్న వారికి ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు. ప్రజల్లో తిరుగుతూ.. ప్రజల సమస్యలు వింటూ.. వారికి సహాయం చేస్తూ వస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన చెరుకు ముత్యం రెడ్డి తనయుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ముత్యంరెడ్డికి దుబ్బాక నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అది శ్రీనివాస్ రెడ్డికి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కూడా ఆయన విజయానికి దోహదపడుతుందని విశ్వసిస్తున్నారు.

రఘునందన్ రావు..

బీజేపీలోనే కాదు.. తెలంగాణలోనే ఫైర్ బ్రాండ్ పొలిటిషీయన్‌గా గుర్తింపు పొందిన రఘునందన్ రావు.. మొదట టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ కోసం పోరాటం చేశారు. కేసీఆర్ వెన్నంటి ఉన్న నేతల్లో రఘునందన్ రావు చాలా కీలకమైన వ్యక్తి. 2001 నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన.. పార్టీలో యువజన నేతగా పని చేశారు. 2004లో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. 2010లో మహాకూటమి తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో బీజేపీ నుంచి దుబ్బాకలో పోటీ చేసి ఓడిపోయారు రఘునందన్ రావు. 2018లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. అయితే, 2021లో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాతపై 1,410 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు మరోసారి దుబ్బాక నుంచి బరిలో నిలుస్తున్నారు రఘునందన్ రావు. ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి రఘునందన్ రావు అటు బీజేపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటంతో పాటు.. ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు. ప్రజలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, ప్రధాని మోదీ పాపులారిటీ, బీజేపీ-జనసేన పొత్తు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో ఉన్నారు రఘునందన్ రావు.

ఇలా నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ప్రచారం పర్వంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ప్రజల దుబ్బాక ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు? ఎవరిని తమ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు? అనేది తేలాలంటే.. డిసెంబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read:

మిర్యాలగూడలో ఐటీ దాడులు.. భాస్కరరావు టార్గెట్‌గా సోదాలు..

ఎమ్మెల్సీ కవిత మాస్ డ్యాన్స్.. తగ్గేదేలే అంటున్న గులాబీ శ్రేణులు..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pregnancy: ఆ టాబ్లెట్ వల్ల గర్భిణీ స్త్రీలకు అలసట...ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!

గర్భిణీ స్త్రీలలో అలసటకు మానసిక, భావోద్వేగ కల్లోలం ఒక కారణం. పిల్లలను చూడాలని, పెంచాలనే, ఎలా ప్రసవించాలనే అలోచనలతో ఉంటారు. దీని ప్రభావం శరీర అసౌకర్యం చిన్న చిన్న నొప్పులు, రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి అనేక సార్లు మేల్కొనడం అలసటకు కారణమవుతుంది.

New Update

Pregnancy: కొంతమంది మహిళలు ఇంటి పని, ఇతర రోజువారీ పనులతో అలసిపోతారు. అయితే గర్భధారణ సమయంలో అలసిపోయినట్లు అనిపించడం కూడా సాధారణం. చాలామంది గర్భిణీ స్త్రీలు తరచుగా అలసటతో బాధపడుతున్నారు. గర్భధారణ తర్వాత వారి శరీరాలు తొలి నెలల్లో గర్భధారణకు అనుగుణంగా మారడానికి చాలా ప్రయత్నిస్తాయి. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండటానికి అనేక చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దీనికి చాలా శక్తి ఖర్చవుతుంది. ఇది తెలియకుండానే చాలా శక్తిని వినియోగిస్తుంది. గర్భిణీ స్త్రీలలో అలసటకు మానసిక, భావోద్వేగ కల్లోలం ఒక కారణం.

హార్మోన్ల వల్ల అలసట:

గర్భిణీలు తమ పిల్లలను చూడాలని మాత్రమే కాకుండా ఎలా ప్రసవించాలి, ఏ ఆసుపత్రికి వెళ్లాలి, ఎంత డబ్బు ఖర్చు చేయాలి. తమ పిల్లలను ఎలా పెంచాలనే ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ ఆలోచనలు చిన్న కుటుంబాలలో ఎక్కువగా కనిపిస్తాయి. దీని ప్రభావం శరీరంపై ఉంటుంది. శరీర అసౌకర్యం చిన్న చిన్న నొప్పులు, రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి అనేక సార్లు మేల్కొనడం కూడా అలసటకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. అలసట సాధారణంగా మొదటి మూడు నెలల్లో ప్రారంభమవుతుంది. ఆరు, ఎనిమిది వారాల మధ్య అలసట సర్వసాధారణం. రెండవ త్రైమాసికంలో అలసట కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే మూడవ త్రైమాసికంలో అలసట మళ్లీ కనిపిస్తుంది. ఇది మొదటి మూడు నెలల్లో హార్మోన్ల వల్ల కలుగుతుంది.

ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉన్నవారు జిమ్‌ చేస్తే ఏమవుతుంది?

మూడవ త్రైమాసికంలో నిద్ర లేకపోవడం, అనారోగ్యం తరచుగా అలసటకు దారితీస్తాయి. గర్భధారణ సమయంలో మహిళలు సరిగ్గా తినకపోవడం సర్వసాధారణం. అలసిపోయినప్పుడు, ముఖ్యంగా వికారం అనిపించినప్పుడు తినడం చాలా కష్టం. అలాంటి సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు తినాలి. ఇవి శరీరానికి పోషణను అందించడమే కాకుండా శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయని నిపుణులు సలహా ఇస్తున్నారు. గర్భిణీ స్త్రీలు అలసటను తగ్గించడానికి నీరు ఎక్కువగా తాగాలి. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా మంచిది. గర్భధారణ సమయంలో తగినంత నీరు తాగితే శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా, సులభంగా సాగుతాయి. తక్కువ శక్తి ఉపయోగించబడుతుంది.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మధ్యాహ్నం ఆఫీసులో నిద్ర రాకుండా ఇలా చేయండి


( pregnancy-care | pregnancy-care-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment