TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే?

తెలంగాణ టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు.

New Update
TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే?

TS DSC Notification: తెలంగాణ (Telangana) టీచర్‌ పోస్టుల (Teacher posts) భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ (DSC Notification)  విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు.

సుమారు పది రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ ని కూడా అధికారులు ఖరారు చేసినట్లు సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు అనుమతి కూడా లభించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయడమే లేటు. ముందుగా ఫిబ్రవరి 28 బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ కొన్ని టెక్నికల్‌ ఇష్యూష్‌ తో పాటు మరికొన్ని తుది మెరుగులు దిద్దుకోవడం కోసం మరో రోజు ఆలస్యం అయ్యింది.

2023 లో 5,089 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటితో కలిపి ఇప్పుడు కొత్త పోస్టులు అన్ని కలుపుకొని డీఎస్సీ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాత నోటిఫికేషన్‌ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.గతం లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్‌ వేర్‌ ను రూపొందించారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్‌ పోస్టులు ఉన్నట్లు తెలిసింది. వాటిల్లో ఎస్జీటీలను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డీఎస్సీలో ప్రకటించే 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జీటీలే ఉండే వీలు ఉంది.

స్కూల్ అసిస్టెంట్‌ ఖాళీలపై మరికొంత స్సష్టత రావాల్సి ఉంది. ప్రమోషన్స్‌ ద్వారా ఎస్జీటీలతో సుమారు 70 శాతం ఖాళీలను భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రమోషన్స్‌ విషయంలో కొంచెంన్యాయపమైన ఇబ్బందులు ఉండడంతో ఎస్‌ఏ పోస్టుల పై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1500-2000 వరకు ఎస్‌ఏ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా చేపట్టే వీలున్నట్లు తెలుస్తుంది.

గతంలో ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో డీఎస్సీ పై చాలా మంది నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షల మంది టెట్‌ ఉత్తీర్ణత పొందారు.

దీంతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రశ్నపత్రాలతో పాటు రిజల్ట్స్ వరకూ మొత్తం సాంకేతికతనే ఉపయోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Also read: డబ్బింగ్‌ చిత్రంతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇస్తున్న జక్కన్న కొడుకు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RRB ALP Jobs 2025: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. వీరందరూ అర్హులే?

రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 9,970 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా మే 11 వరకు అప్లై చేసుకోవచ్చు.

New Update
RRB ALP Jobs 2025

RRB ALP Jobs 2025

రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్ల పరిధిలోని అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా మొత్తం 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం అయింది. మే 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అని అనుకున్న అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌,  ఎలక్ట్రికల్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా అర్హులు. రెండు స్టేజ్‌ల కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ ఉంటుంది. అనంతరం ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు.

RRB రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, భోపాల్, బెంగళూరు, బిలాస్‌పూర్, భువనేశ్వర్, చెన్నై, చండీఘడ్‌, పట్నా, జమ్ము అండ్‌ శ్రీనగర్, గువాహటి, మాల్దా, కోల్‌కతా, ముజఫర్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ముంబయి, సికింద్రాబాద్, రాంచీ, తిరువనంతపురం, సిలిగురి, గోరఖ్‌పూర్. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య- 9,970.

రీజియన్ల వారీగా ఖాళీలు

అహ్మదాబాద్ - 497 పోస్టులు

అజ్మీర్ - 820 పోస్టులు

ప్రయాగ్‌రాజ్‌ -588 పోస్టులు

భోపాల్‌ - 664 పోస్టులు

భువనేశ్వర్ -928 పోస్టులు

 బిలాస్‌పూర్ - 568 పోస్టులు

 చండీఘడ్‌ - 433 పోస్టులు

చెన్నై - 362 పోస్టులు

ముజఫర్‌పూర్ - 89 పోస్టులు

Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

పట్నా - 33 పోస్టులు

ప్రయాగ్‌రాజ్ - 286 పోస్టులు

రాంచీ - 1,213 పోస్టులు

సికింద్రాబాద్ - 1,500 పోస్టులు

సిలిగురి - 95 పోస్టులు
గువాహటి - 30 పోస్టులు

జమ్ము అండ్‌ శ్రీనగర్ - 08 పోస్టులు

కోల్‌కతా - 720 పోస్టులు

మాల్దా - 432 పోస్టులు

ముంబయి - 740 పోస్టులు

తిరువనంతపురం - 148 పోస్టులు

గోరఖ్‌పూర్ - 100 పోస్టులు

అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. లేదా ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 11.05.2025.

jobs | rrb recruitment 2025 | rrb updates | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment