Telangana Constables: నిరుద్యోగులకు శుభవార్త.. నేడు సీఎం చేతుల మీదుగా 15,750మందికి జాబ్స్!

తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియ ముందుకు కదిలింది. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఎల్‌బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మొత్తం 15,750మందికి సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేస్తారు.

New Update
Telangana Constables: నిరుద్యోగులకు శుభవార్త.. నేడు సీఎం చేతుల మీదుగా 15,750మందికి జాబ్స్!

Telangana Constable Appointment Letters: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(ఫిబ్రవరి 14న) సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో (LB Stadium) 15,750 మంది పోలీసు కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఈ 15,750 మంది అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ద్వారా 16,604 నోటిఫైడ్ ఖాళీలకుగానూ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఎంపికయ్యారు. అక్టోబర్ 2023లో, TSLPRB SCT PC, ఇతర ఖాళీల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ తుది ఫలితాన్ని ప్రకటించింది. అటు ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం నాడు జరిగిన కమిటీ సమావేశంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌పై జీఓ 46ను రద్దు చేసే అవకాశాలపై కూడా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చర్చించారు.

హైకోర్టు తీర్పు తర్వాత:

నాలుగు వారాల్లోగా పోలీసు కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ని తెలంగాణ హైకోర్టు గత జనవరి 5న ఆదేశించింది. న్యాయమైన, వేగవంతమైన రిక్రూట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఔత్సాహిక అధికారులకు ఈ తీర్పు పెద్ద ఉపశమనం కలిగించింది. ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు పరీక్షకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పరిష్కరించాలని TSLPRBని హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు రేవంత్‌ రెడ్డి ఉద్యోగాలపై దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి TSPSCతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు(Government Jobs) సంబంధించిన బోర్డులు, నోటిఫికేషన్లపై రేవంత్‌ అనేకసార్లు ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt) తీసుకుంటుందని చెబుతున్నారు. అటు డిసెంబరు 2024 నాటికి తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా పలుశాఖల పోస్టుల సంఖ్యను పెంచినట్టుగా అర్థమవుతోంది.

Also Read: రేవంత్ ప్రేమ ‘గీతం’..🥰😘 వాళ్లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment