Telangana Congress First List: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే...

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధుల మొదటి లిస్ట్ తయారైంది. ఈరోజు ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ లిస్ట్ మీద చర్చించారని తెలుస్తోంది. 35 నియోజకవర్గాల్లో ఒక్కో అభ్యర్ధి మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో వారినే ఫైనల్ చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.  

New Update
Telangana Congress First List: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఇదే...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యిందనే చెప్పాలి. ఇక్కడి అధికార బీఆర్ఎస్ పార్టీ తన పార్టీ అభ్యర్ధలు జాబితాను విడుదల చేసేయడంతో కాంగ్రెస్, బీజెపీలు సైతం క్యాండిడేట్ల లిస్ట్ మీద కసరత్తులు ప్రారంభించాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయింది.  ఈ కమిటీ సమావేశంలో ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవానీ, సిద్ధిఖి, ఎక్స్ అఫిషియో సభ్యులుగా రాష్ట్ర ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు.  35 నియోజకవర్గాలకు  ఒక్కొక్కరే దరఖాస్తు చేయడంతో వారినే ఫైనల్ చేయాలని  స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. లిస్టులో ఉన్న అభ్యర్థులనే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీకి ఫైనల్‌ చేసిన లిస్టును పంపి...ఈ నెలాఖరులోగా ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే ఛాన్స్‌ ఉందని సమాచారం.

స్క్రీనింగ్ కమిటీ సింగిల్ నేమ్ తో కేంద్ర ఎన్నికల కమిటీ కి పంపే జాబితా:
--------------------------------
1. కొడంగల్ - రేవంత్ రెడ్డి
2. హుజూర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి 3.కోదాడ - పద్మావతి
4. మధిర - భట్టి విక్రమార్క
5. మంథని - శ్రీధర్ బాబు
6. జగిత్యాల - జీవన్ రెడ్డి
7. ములుగు - సీతక్క
8. భద్రాచలం - పొడెం వీరయ్య
9. సంగారెడ్డి - జగ్గారెడ్డి
10. నల్గొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
11. అలంపూర్ - సంపత్ కుమార్
12. నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి
13. కామారెడ్డి - షబ్బీర్ అలీ
14. పాలేరు - తుమ్మల నాగేశ్వరరావు
15. కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి
16. పరిగి - రామ్మోహన్ రెడ్డి
17. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ కుమార్
18. మహేశ్వరం - చిగురింత పారిజాత
19. ఆలేరు - బీర్ల ఐలయ్య
20. ఖైరతాబాద్ - రోహిన్ రెడ్డి
21. దేవరకొండ - వడ్త్య రమేష్ నాయక్
22. వేముల వాడ - ఆది శ్రీనివాస్
23. ధర్మపురి - లక్ష్మణ్
24. జడ్చర్ల - అనిరుద్ రెడ్డి
25. హుజూరాబాద్ - బల్మూర్ వెంకట్
26. నాంపల్లి - ఫిరోజ్ ఖాన్
27. కోరుట్ల. జువ్వాడి నర్సింగ్ రావు
28.అచ్చంపేట - వంశీకృష్ణ
29 జహీరాబాద్ - ఏ. చంద్రశేఖర్
30. ఆందోల్ - దామోదర రాజనర్సింహ
31.మంచిర్యాల - ప్రేమ్ సాగర్ రావు
32. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు
33. ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి
34. వరంగల్ ఈస్ట్ - కొండా సురేఖ
35. భూపాల పల్లి - గండ్ర సత్యనారాయణ

ఇదిలా ఉండగా...ట్ గా హైదరాబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల్లో... ఈ ఇయర్ ఎండ్ లో తెలంగాణతో సహా మరో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాంగానే ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HYD Scam: బంగ్లాదేశ్ లో పుట్టినోళ్లకు హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికేట్.. షాకింగ్ స్కామ్ బయటపెట్టిన పోలీసులు!

బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్నారు. ఆ చొరబాటుదారులకు బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.

New Update
Two Bangladeshi Nationals Arrested in Hyderabad

Two Bangladeshi Nationals Arrested in Hyderabad

HYD Scam: బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు మనదేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారన్న విషయం చాలాసార్లు రుజువైంది. బంగ్లా సరిహద్దుల్లో ఉన్న భద్రత దళాల కన్నుగప్పి మనదేశంలోకి పలువురు ప్రవేశిస్తున్నారు. అలా వచ్చినవారిలో చాలామంది హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారనే విషయం చాలాసార్లు రుజువైంది. అయితే ఆ అక్రమ చొరబాటుదారులకు స్థానిక బర్త్‌ సర్టిఫికెట్‌ ఇస్తూ వారిని స్థానికులుగా నమ్మిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు.బర్త్ సర్టిఫికెట్ పత్రంపై అనుమానంతో తీగ లాగితే డొంక కదిలింది.

ఇది కూడా చదవండి: రాత్రంతా ఏసీ వాడుతున్నారా..అయితే జాగ్రత్త

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . మహ్మద్‌ హసిబుల్ అనే వ్యక్తి ఢాకా నుంచి అక్రమంగా కోల్‌కతా చేరి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డాడు. అయితే ఆయన విషయంలో అనుమానం రావడంతో ఎంక్వయిరీ చేయగా షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి. బంగ్లా రాజధాని ఢాకాకు చెందిన ప్రధాన నిందితుడు మహ్మద్ హసిబుల్ నాలుగేళ్ల క్రితం భారత్‌లోకి వచ్చాడు. ఏజెంట్లకు రూ.25 వేలిచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించాడు. కోల్‌కతాలోని సౌత్రాలో జోవన్ చౌదరి పేరుతో నకిలీ ఆధార్ కార్డు సేకరించాడు. అక్కడే కరాటే శిక్షకుడిగా పని చేస్తూ నెలకు రూ.20 వేల సంపాదనతో జీవనం సాగించాడు. 2023 డిసెంబర్​లో ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా హైదరాబాద్‌ మలక్‌పేట్‌కు చెందిన జయా చౌదరితో పరిచయం పెంచుకున్నాడు. తాను కోల్‌కతా పౌరుడినంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మలక్‌పేటకు మకాం మార్చి ఆన్‌లైన్‌ వస్త్ర వ్యాపారం, ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

ఇదే సమయంలో తనకు  బర్త్‌ సర్టిఫికెట్‌ఇప్పించాలంటూ మలక్‌పేట్‌లోని పాన్‌ దుకాణ యజమాని మహ్మద్ ముఖీద్‌ను మహ్మద్‌ హసిబుల్‌ కోరాడు. అతడు కోల్‌కతా నుంచే వచ్చాడని నమ్మిన పాన్‌షాప్‌ యజమాని, చాదర్ ఘాట్‌లోని డీటీపీ ఆపరేటర్ సాయికిరణ్‌ను పరిచయం చేశాడు. అతడు చంచల్‌గూడలోని రజనీకాంత్‌ను సంప్రదించమని సూచించాడు. రజనీకాంత్‌ ద్వారా నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సుధీర్‌కుమార్‌ను మహ్మద్ హసిబుల్ కలిశాడు. రూ.15 వేలు కమీషన్ ఇచ్చి జోవన్ చౌదరి పేరుతో  బర్త్‌ సర్టిఫికెట్‌ పొందాడు. వాటి ఆధారంగా ఓటరు గుర్తింపు కార్డు సైతం సంపాదించాడు.  బర్త్‌ సర్టిఫికెట్‌, ఓటరు ఐడీ రెండు ఉండడంతో ఆధార్ కార్డు పొందేందుకు మహ్మద్‌ హసిబుల్‌ సిద్ధమయ్యాడు.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!

ఇదిలా ఉండగానే 3 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా చేరి టూరిస్ట్ గైడ్‌గా పని చేస్తున్న రోహన్‌షాతో మహ్మద్‌ హసిబుల్‌కు పరిచయం ఏర్పడింది. తన భార్య గర్భంతో ఉందని సహకరించాలని కోరటంతో రోహన్ షాను హైదరాబాద్‌ రప్పించిన హసిబుల్‌ తన ఇంట్లో వసతి కల్పించాడు. అతడికి నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. హసన్‌, రోహన్‌ షా భారత పౌరులుగా చెలామణి అయ్యేందుకు పాస్‌పోర్ట్స్ పొందాలని నిర్ణయించుకొని నకిలీ ఆధార్‌ కార్డులతో దరఖాస్తు చేసుకున్నారు. పోలీసుల పరిశీలనలో అవి నకిలీవిగా తేలటంతో మధ్య మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్‌పెక్టర్ ఖలీల్ పాషా బృందం రంగంలోకి దిగింది. అసలు వారికి ఆ నకిలీ కార్డ్సు ఎలా వచ్చాయి అనే విషయంలో కూఫీ లాగడం మొదలు పెట్టాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి

బంగ్లాదేశీయుడి నుంచి రాబట్టిన సమాచారంతో పాన్ దుకాణదారుడిని పోలీసులు ప్రశ్నించటంతో మిగిలిన వారి ప్రమేయం వెలుగు చూసింది. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు, తమకు బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలని సుధీర్‌ని కోరటంతో అంగీకరించాడు. దీంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం మలక్‌పేట్‌ పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో నార్సింగి మున్సిపాలిటీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి సుధీర్‌ కుమార్‌, ఏజెంట్లు మహ్మదులీజ్‌, టి.సాయికిరణ్‌, రజనీకాంత్‌, బంగ్లా దేశస్థులు మహ్మద్‌ హసిబుల్‌, రోహన్‌ ఉన్నారు. నిందితుల నుంచి 7 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, నకిలీ ఆధార్, ఓటర్‌ గుర్తింపు, బర్త్‌ సర్టిఫికెట్లు, బంగ్లా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

Advertisment
Advertisment
Advertisment