Hyderabad : హైదరాబాద్ విస్తరణపై కాంగ్రెస్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం!

కొత్త హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌ దిశగా రేవంత్‌ సర్కార్‌ అడుగులేస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే భౌగోళిక విస్తరణలో హైదరాబాద్ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUDని సీఎం ఆదేశించారు.

New Update
Hyderabad : హైదరాబాద్ విస్తరణపై కాంగ్రెస్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం!

Greater Hyderabad Expansion : హైదరాబాద్‌(Hyderabad) నగరాన్ని మరింత విస్తరించాలని కాంగ్రెస్‌(Congress) భావిస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం చేయాలని చూస్తోంది. శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల విలీనం దిశగా అడుగులేస్తోంది. దీనిపై ఓ అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాల్టీలను విలీనం చేసే అవకాశం కనిపిస్తోంది. అన్నింటినీ కలిపి గ్రేటర్‌ సిటీ కార్పొరేషన్‌(Greater City Corporation) ఏర్పాటు చేసే ఛాన్స్‌ ఉంది. లేదంటే నాలుగు కార్పొరేషన్లుగా విభజన జరగవచ్చు. ప్రస్తుతం మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమిస్తారని సమాచారం. వచ్చే ఏడాది GHMC తో పాటు ఇతర పౌర సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి.

దేశంలోనే అదిపెద్దది?
GHMC పట్టణ సముదాయం 625 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA) దాని పరిధిలో 7,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలో బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, బడంగ్‌పేట్, మీర్‌పేట్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మణికొండ, నార్సింగి, తెల్లాపూర్ లాంటి 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్త గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ భౌగోళిక విస్తరణ దేశంలోనే అతిపెద్దదిగా మారుతుంది. ఈ ప్రతిపాదనపై పనిచేయాలని MAUD ని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశించినట్లు సమాచారం. వివిధ నగరాల నమూనాలను, ముఖ్యంగా మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీని అధ్యయనం చేయాలని చెప్పినట్టుగా తెలుస్తోంది.

నిధులు అవసరం:
నిజానికి కోర్ సిటీ ప్రాంతంలో అన్ని ప్రధాన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వీటి కోసం ఎక్కువ నిధులు అవసరం లేదు. కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు పౌర మౌలిక సదుపాయాలను పెంచడానికి అత్యవసర నిధులు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. హెచ్‌ఎండీఏను ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

Also Read : ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవే.. కానీ పనిచేస్తుంది.. ఎందుకంటే..
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు