TS Ration Cards: రేషన్‌కార్డుల్లో వడబోత.. రేవంత్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌!

రైతుబంధులో రూ.22వేల కోట్లు అనర్హులకు చేరాయన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌. సంక్షేమ పథకాలకు తెల్లరేషన్‌ కార్డే కొలబద్ద అని చెప్పారు. ఉచిత విద్యుత్తు, రాయితీ సిలిండర్‌ రాకపోతే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సీఎం చెప్పారు.

New Update
TS Ration Cards: రేషన్‌కార్డుల్లో వడబోత.. రేవంత్‌ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌!

CM Revanth On Ration Cards: సంక్షేమ పథకాల అమలుపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి. సంక్షేమ పథకాలకు ఏదైనా కొలబద్ద ఉండాలని రేవంత్‌ చెప్పుకొచ్చారు. నిస్సహయులకు కొలబద్ద తెల్లరేషన్‌ కార్డేనని తెలిపారు. తెల్లరేషన్‌ కార్డును ప్రాథమిక అర్హతగా అమలు చేస్తామని సీఎం చెప్పారు. కొత్త కార్డులను త్వరలో జారీ చేస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. కంగారుపడి కొత్త కార్డులు ఇస్తే అనర్హులకు రైతుబంధు ఇచ్చినట్లు ఉంటుందని రేవంత్‌ అభిప్రాయపడ్డారు. రైతుబంధులో రూ.22వేల కోట్లు అనర్హులకు చేరాయన్నారు రేవంత్‌.

కంప్లైంట్ చేయవచ్చు:
సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని రేవంత్‌ తెలిపారు. రేషన్‌కార్డు లేని వాళ్లు కంగారు పడాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారు. రేషన్‌కార్డు పొందిన తర్వాత పథకాలు అందుతాయన్నారు రేవంత్‌. అర్హులకు తర్వాతి దశలో పథకాలు అందజేస్తామని క్లారిటీ ఇచ్చారు. అర్హులందరికీ పథకాలు అందాలన్నదే ప్రభుత్వం విధానమన్నారు రేవంత్. ఉచిత విద్యుత్తు, రాయితీ సిలిండర్‌ రాకపోతే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని సీఎం చెప్పారు. ప్రత్యేక హెల్ఫ్ డెస్క్‌ల ద్వారా తక్షణమే ఫిర్యాదులను పరిష్కరిస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని.. కరెక్షన్స్ చేసేందుకు అధికారులకు పవర్స్‌ ఇచ్చామని రేవంత్‌ క్వారిటీ ఇచ్చారు.

ఇక రంగారెడ్డి జిల్లా చేవేళ్ల వేదికగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనుంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత.. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.

 Also Read: రేపే మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనున్న కాంగ్రెస్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు