TS Cabinet : తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే?

త్వరలో తెలంగాణ కేబినెట్‌ను విస్తరించనున్నారు. 6 గురు కొత్త మంత్రులకు బాధ్యత అప్పగించనుంది రేవంత్ సర్కార్‌. బీసీ, ముదిరాజ్‌, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
TS Cabinet : తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే?

Telangana Cabinet Expansion : త్వరలో తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet) ను విస్తరించనున్నారు. 6 గురు కొత్త మంత్రులకు బాధ్యత అప్పగించనుంది రేవంత్ సర్కార్‌ (Revanth Sarkar). అయితే ఆ ఆరుగురు మంత్రులు (Ministers) ఎవరనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. బీసీ, ముదిరాజ్‌, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. మక్తల్ నుంచి గెలిచిన వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలకు ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం నడుస్తోంది.

నిజామాబాద్‌ నుంచి మదన్‌మోహన్‌రావు, సుదర్శన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ప్రేమ్‌సాగర్‌ రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్‌ల పేర్లు ప్రసావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మైనార్టీ కోటాలో ఫిరోజ్‌ఖాన్‌కు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. కేబినేట్ విస్తరణ నేపథ్యంలో.. మంత్రి పదవి కోసం ఇప్పటికే సీనియర్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఎవరకి ఏ మంత్రి పదవి ఇస్తారనేది మరికొన్నిరోజుల్లోనే తేలనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు (Lok Sabha Elections Results) వచ్చాక.. అసెంబ్లీ సమావేశాల్లోపు కేబినెట్‌ను విస్తరించాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తత కేబినెట్‌లో ఎవరున్నారంటే

1.ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు

2.నల్గొండ నుంచి ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,

3.వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క

4.కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు

Also read: రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు: డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ

Advertisment
Advertisment
తాజా కథనాలు