TELANGANA BJP:తెలంగాణ బీజెపీ నేత సత్యవతి హఠాన్మరణం భద్రాచలం మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కుంజ సత్యవతి హఠాత్ మరణం. ఆదివారం అర్ధరాత్రి బిపి లెవెల్స్ పడిపోయి అస్వస్థకు గురైన సత్యవతిని భద్రాచలం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మరణించారు. By Manogna alamuru 16 Oct 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి భద్రాచలం మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత కుంజ సత్యవతి మఈతి చెందారని ఆమె కుటుంబసభ్యలు ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రి బిపి లెవెల్స్ పడిపోయి, గుండెపోటుకు గురైన సత్యవతిని భద్రాచలం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మృతి...తెలంగాణ బీజెపీని షాక్ కు గురి చేసింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు.భద్రాచలంలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను కుటుంబ సభ్యులు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సత్యవతి తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆగస్టు 1-1971లో కుంజా సత్యవతి జన్మించారు. 1988లో కుంజా ధర్మారావును ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1991లో భద్రాచలం ఎంపీపీగా కుంజా సత్యవతి రాజుకీయ ప్రస్థానం మొదలైంది. 2009లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. 2017లో తన భర్త కుంజా ధర్మతో కలిసి సత్యవతి బీజేపీలో చేరారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగారు. ప్రస్తుతం ఆమె బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు సత్యవతి. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు షాక్ లో ఉన్నారు. ఈ హఠాత్ పరిణామం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. Also Read:జమ్మికుంటకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. షెడ్యూల్ వివరాలివే.. #telangana #bjp #death #leader #satyavathi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి