Telangana:కారు బోల్తా..తెలంగాణ విప్‌ కు గాయాలు

తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ప్రమాదంలో లక్ష్మణ్ , ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి.

New Update
Telangana:కారు బోల్తా..తెలంగాణ విప్‌ కు గాయాలు

Telangana Whip:తెలంగాణ విప్‌కు ఊహించని ప్రమాదం ఎదురయ్యింది. ఆయన ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. ఎండపల్లి మండలం అంబారీ పేట దగ్గర విప్, దర్మపురి ఎమ్మెల్యే  అడ్లూరి  లక్ష్మణ్ ప్రయాణిస్తున్న కురు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్‌తో పాటు మరి కొంత మందికి గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. అలాగే పెద్ద గాయాలు కూడా కాలేదు. స్వల్పంగా గాయపడిన లక్ష్మణ్, ఇతరులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలుస్తోంది.

Also Read:నేడు లక్నోలో పర్యటించనున్న మోదీ.. రూ.10 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!

ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ నిన్న హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గానికి బయలుదేరారు. అతనితో పాటూ మరి కొంత మంది కారులో ఉన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి దగ్గరకు వచ్చేసరికి అర్ధరాత్రి 3.15 అయింది. అదే సమయంలో కారు ప్రమాదానికి గురయింది. కారు చాలా వేగంగా వెళుతోంది. ఇంతలో లారీ అడ్డురావడంతో దాన్ని తప్పించబోయాడు డ్రైవర్.. ఈక్రమంలో వేగానికి అదుపు తప్పి కారు బోల్తా పడింది. అయితే కారులోని ఎయిర్‌ బ్యాగ్‌లు వెంటనే తెరుచుకోవడంతో ఎమ్మెల్యే లక్ష్మన్, ఇంకా కారులో ఉన్నవారి ప్రాణాలు కాపాడబడ్డాయి.

ఈ ప్రమాదంలో లక్ష్మణ్ తలకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆయనను వెంటనే కరీంగనర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే లక్ష్మణ్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పలువురు అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఎందుకైనా మంచిదని... మరింత మెరుగైన చికిత్స కోసం లక్ష్మణ్‌ను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలని అనుకుంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment