Crime News: బెయిల్‌పై బయటకు వచ్చి.. నడిరోడ్డుపై యువతిని పరిగెత్తించి చంపారు..

ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి అనే జిల్లాలో బెయిల్‌పై ఇటీవల బయటకు వచ్చిన ఇద్దరు సోదరులు.. ఓ యువతిని నడిరోడ్డుపై పరిగెత్తించి గొడ్డలితో నరికి హత్య చేశారు. అయితే ఆ సోదరుల కుటుంబానికి, యువతి కుటుంబానికి పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు.

New Update
హైదరాబాదులో దారుణం.. మహిళను కారుతో ఢీ కొట్టి..!

క్షణికావేశంలో తప్పులు చేసి జైల్లో మగ్గుతున్నవారెందరో ఉన్నారు. ఇలాంటి వాళ్లు బెయిల్‌ కోసం పరితపిస్తుంటారు. బెయిల్ రాగేనే తమ జీవితాలను మార్చుకొని బ్రతకాలనుకుంటారు. అయితే ఓ ఇద్దరు యువకులు మాత్రం బెయిల్‌ పై వచ్చి నడిరోడ్డుపై ఓ యువతిని పరిగిత్తించి మరీ హత్య చేయడం సంచలనం రేపుతోంది. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'పవన్‌ నిషద్‌, అశోక్‌ నిషద్‌ అనే ఇద్దరు సోదరులు వేరువేరు కేసుల్లో జైలుకి వెళ్లి కొద్దిరోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత పశువులు కాసుకొని ఇంటికి వస్తున్న 19 ఏళ్ల యువతిని నడిరోడ్డుపై వెంటాడి గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య పాత కక్షలు ఉండటం వల్లే వాళ్లు ఇలా ఆమెను హత్య చేశారనిట పోలీసులు తెలిపారు.

Also Read: కన్నకొడుకుల గొంతు కోసిన కసాయి తండ్రి.. రెండేళ్ల పసిప్రాణం బలి

అయితే మూడేళ్ల క్రితం ఆ యువతిపై పవన్‌ నిషద్ ఓరోజు అత్యాచారం చేశాడనే ఆరోపణలు రావడంతో అతడ్ని జైల్లో వేశారు. దీంతో నిషద్‌పై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు ఆ యువతి కుటుంబాన్ని వేధిస్తున్నారు. కానీ ఆ యువతి కుటుంబ సభ్యులు మాత్రం వీళ్లకి లొంగిపోవడం లేదు. ఇక పవన్‌ సోదరుడు అశోక్ నిషద్‌.. వేరే కేసులో జైల్లోకి వెళ్లి ఇటీవల బెయిల్‌పై విడుదల కాగా.. అతనితో పాటే పవన్‌ కూడా బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత పవన్‌పై ఉన్న అత్యాచార కేసును వెనక్కి తీసుకోవాలని ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. అయినా కూడా ఆ యువతి కుటుంబ సభ్యులు తలొగ్గలేదు. చివరికి ఆ సోదరిద్దరూ ఆమెను చంపేందుకు ప్లాన్‌ చేశారు. ఆ యువతి పశువులు కాసుకొని తిరిగి వస్తుండగా.. పరిగిత్తించి గొడ్డలితో నరికేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకునేందుకు పోలీసులకు రంగంలోకి దిగారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు