WhatsApp: ఫోన్‌ నెంబర్‌తో పనిలేదు.. యూజర్‌ నేమ్‌తో చాటింగ్, కాల్స్.. వాట్సాప్‌లోకి వచ్చిన అదిరిపోయే ఫీచర్

వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ చేయాలంటే ఫోన్ నెంబర్‌ ఉండాల్సిందే. కానీ ఇకనుంచి ఫోన్‌ నెంబర్లు లేకున్న పర్లేదు. యూజర్‌ నేమ్‌తోనే ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. తాజాగా వాట్సాప్ IOS, ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ను రిలీజ్ చేసింది.

New Update
WhatsApp is rolling out the username feature on Android and iOS

WhatsApp is rolling out the username feature on Android and iOS

వాట్సాప్‌లో చాటింగ్, కాల్స్, వీడియో కాల్స్ చేయాలంటే ఫోన్ నెంబర్‌ ఉండాల్సిందే. కానీ ఇకనుంచి ఫోన్‌ నెంబర్లు లేకున్న పర్లేదు. యూజర్‌ నేమ్‌తోనే ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ ఫీచర్‌ రెడీ అయిపోయింది. తాజాగా వాట్సాప్ IOS, ఆండ్రాయిడ్ యూజర్లకు దీన్ని రిలీజ్ చేసింది. ముందుగా పరిమిత సంఖ్యలోనే యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత దశల వారీగా ఇది అందరికీ అందుబాటలోకి రానుంది.  

ప్రస్తుతం వాట్సాప్‌లో ఎవరితోనానా పర్సనల్‌గా మెసేజ్, కాల్స్ చేయాలంటే ఫోన్ నెంబర్ ఉండాల్సిందే. అయితే కొందరు ఫోన్ నెంబర్ ఇచ్చేందుకు ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే యూజర్‌నేమ్‌తో ఇతరులతో కనెక్ట్ కావొచ్చు. ఇతరులకు ఫోన్ నెంబర్ ఇవ్వడం ఇష్టం లేనివాళ్లకి ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడనుంది.  

Also Read: చరిత్ర సృష్టించనున్న ఆర్టెమిస్ II.. 54 ఏళ్ల అపోలో రికార్డ్ బ్రేక్

యూజర్‌ నేమ్‌ ఎలా ?

యూజర్‌ నేమ్‌ను 3 అక్షరాల నుంచి 35 అక్షరాల దాకా పెట్టుకోవచ్చు. కానీ దీనిలో az,09,డాట్,అండర్‌ స్కోర్ మాత్రమే వాడాలి. www, .com, .net లాంటివి వాడరాదు. అంతేకాదు అదనంగా 4 అంకెలతో యూజర్‌ నేమ్‌కు కీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎవరైన మీతో ఫస్ట్‌ టైం కాంటాక్ట్‌ కావాలని అనుకుంటే మీ యూజర్‌ నేమ్‌తో పాటు ఆ కీ షేర్ చేయాలి. ఈ ఫీచర్ స్పామ్ మెసేజ్‌లు తగ్గించేందుకు కూడా ఉపయోగపడనుంది.  మీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వాడుతున్న యూజర్‌ నేమ్‌లను కూడా వాట్సాప్‌లో వాడుకోవచ్చు. ఈ అకౌంట్స్‌తో వాట్సాప్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకే రకమైన యూజర్ నేమ్ వినియోగించకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. వాట్సాప్ ప్రొఫెల్ సెట్టింగ్స్‌లో యూజర్‌ నేమ్ ఎంచుకునే ఆప్షన్ ఉందో లేదో చూసుకోవచ్చు. ఒకవేళ ఆ ఫీచర్‌ మీకు రాకుంటే మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 

Also Read: టెన్షన్ టెన్షన్... మళ్లీ మొదలైన యుద్ధం..దుబాయ్‌, కువైట్‌పై ఇరాన్ భీకర దాడి

Advertisment
తాజా కథనాలు