/rtv/media/media_files/2025/04/02/duhDwxFBdHhmBi7dqkSe.jpg)
WhatsApp banned 97 lakh accounts in India
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోదారుల సేఫ్టీ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇందులో భాగంగానే వాట్సాప్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో దాదాపు 97 లక్షల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసింది.
Also Read: ఈ సారి ట్రంప్ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!
AI టెక్నాలజీతో గుర్తింపు
తప్పుదోవ పట్టించే ఖాతాలను AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ ద్వారా గుర్తించి వాటిలో.. 14 లక్షల ఖాతాలపై ఫిర్యాదులు రాకముందే చర్యలు తీసుకుంది. ఈ మేరకు యూజర్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని వాట్సాప్ తెలిపింది. నకిలీ అకౌంట్లు, స్పామ్ మెసేజ్ పంపడం, థర్డ్ పార్టీ యాప్స్ వాడటం, తప్పుడు ఇన్ఫర్మెషన్ షేర్ చేయడం వంటి కారణాలతో ఆయా అకౌంట్లను బ్యాన్ చేస్తోంది.
Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!
కాగా భారతదేశంలో వాట్సాప్ యాప్ వాడుతున్న యూజర్లు దాదాపు 50 కోట్లకు పైగా ఉన్నారు. అందులో ఇప్పుడు దాదాపు 97 లక్షల వాట్సాప్ ఖాతాలను ఒకేసారి బ్యాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా తమ యూజర్ల భద్రతే తమకు ముఖ్యమని వాట్సాప్ అంటోంది. అందువల్లనే కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.
Also Read: యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాకు షాక్.. సుప్రీం కోర్టు కీలక ప్రకటన
బ్యాన్ ఎందుకు చేస్తారు?
వాట్సాప్ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఖాతాలను నిషేధిస్తుంది. అందులో
ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం
ప్రజలను గ్రూపుల్లోకి బలవంతంగా చేర్చడం
స్పామ్ మెసేజ్‌లు పంపడం
థర్డ్ పార్టీ యాప్స్ వాడటం
తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం
ఇలాంటి చర్యలకు పాల్పడితే వాట్సాప్ ఖాతాను బ్యాన్ చేసే ఛాన్స్ ఉంది. అందువల్లనే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని వాట్సాప్ చెబుతుంది.
(whatsapp-ban | latest-telugu-news | telugu-news | whatsapp | breaking-news)