5g Smartphones Under Rs 10,000: శ్రీరామనవమి స్పెషల్ ఆఫర్స్.. రూ.10వేల లోపే బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్లు!

శ్రీరామ నవమి వేడుక సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10వేల లోపు 5జీ ఫోన్లు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. Infinix Hot 50 5G రూ.8,999, itel P55 5G రూ. 7,749, Tecno Spark 30C 5G రూ.9,249, Poco C75 5G రూ. 7,599, Motorola G35 5G రూ.8,499కి కొనుక్కోవచ్చు.

New Update
Top 5G smartphones available on Flipkart under Rs 10,000

Top 5G smartphones available on Flipkart under Rs 10,000

భారతీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు అదిరిపోయే డిమాండ్ ఉంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం కొత్త కొత్త మోడళ్లను తక్కువ ధరలో రిలీజ్ చేస్తున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరలో అధునాతన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం. కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.10,000లోపే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10 వేల కంటే తక్కువ ధరకు లభించే 5జీ ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Also read: పెళ్లైన తెల్లారే జంప్.. ఇప్పటికే ముగ్గురితో మూడు ముళ్లు!

5g Smartphones Under Rs 10,000

Infinix Hot 50 5G

Infinix Hot 50 5G స్మార్ట్‌ఫోన్‌లోని బేస్ వేరియంట్ 4GB RAM - 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు లబిస్తుంది. ఇది ఫ్లిప్‌‌కార్ట్‌లో రూ.9,499కి లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ చెల్లింపులపై రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఇన్ఫినిక్స్ ఫోన్ రూ.8,999లకే లభిస్తుంది. 

Also Read : అయ్యో తల్లి.. నవరాత్రుల కోసం ప్లాన్.. పీరియడ్స్ రావడంతో సూసైడ్!

itel P55 5G

itel P55 5G ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని 6GB RAM - 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,999కి అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. BOBCARD కార్డ్ EMI ట్రాన్సక్షన్లపై 10 శాతం తగ్గింపు (రూ.1250 వరకు) పొందొచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఐటెల్ ఫోన్‌ను కేవలం రూ. 7,749 అవుతుంది. 

Also read :  నీ అభిమానం సల్లగుండా.. పవన్ కోసం రక్తం చిందించిన అభిమాని.. ఏం చేశాడంటే?

Tecno Spark 30C 5G

Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM - 64GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ చెల్లింపుపై రూ.750 తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత టెక్నో ఫోన్ రూ.9,249కి లభిస్తుంది.

Poco C75 5G

Poco C75 5G ఫోన్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. దీని 4GB RAM - 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.7,999కి జాబితా చేయబడింది. IDFC FIRST డెబిట్ కార్డ్ చెల్లింపుపై 5 శాతం తగ్గింపు (రూ. 750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీనిని కేవలం రూ. 7,599 కొనుక్కోవచ్చు. 

Motorola G35 5G

Motorola G35 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM - 128GB స్టోరేజ్ వేరియంట్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువకే లభిస్తుంది. ఇది రూ.9,999కి లిస్ట్ అయింది. IDFC FIRST డెబిట్ కార్డ్ చెల్లింపుపై 5 శాతం తగ్గింపు (రూ. 750 వరకు) పొందొచ్చు. ఈ తగ్గింపు తర్వాత మోటోరోలా ఫోన్‌ను కేవలం రూ.8,499కే పొందొచ్చు. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది.

(tech-news | telugu tech news | latest-telugu-news | telugu-news | mobile-offers)

Advertisment
Advertisment
Advertisment