/rtv/media/media_files/2025/10/03/tcs-2025-10-03-18-00-43.jpg)
TCS
ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా అంతర్జాతీయ ఏఐ దిగ్గజ సంస్థ 'ఆంథ్రోపిక్'తో టీసీఎస్ కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వ్యాపార ప్రపంచంలో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు చేతులు కలిపాయి. ఈ భాగస్వామ్యం ద్వారా అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేసి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు అందించనుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా టీసీఎస్ ఏఐ సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఓ ప్రత్యేకమైన వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ విభాగం పూర్తిగా ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన 'క్లాడ్' ఏఐ టూల్స్ వినియోగం, పరిశోధన, క్లయింట్ల అవసరాలకు తగినట్లుగా పరిష్కారాలను రూపొందించడంపై పనిచేస్తుంది. దీని ద్వారా వ్యాపార కార్యకలాపాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీసీఎస్ రెడీ అవుతోంది.
𝐓𝐂𝐒 𝐁𝐞𝐭𝐬 𝐁𝐢𝐠 𝐨𝐧 𝐀𝐈 :
— VARTA ( वार्ता ) (@varta24news) June 11, 2026
In a major technology initiative, TCS will collaborate with Anthropic to bring AI solutions to enterprises and train 50,000 employees on Claude.#ArtificialIntelligence#TCS
50 వేల మంది ఉద్యోగులకు శిక్షణ
ఈ ఒప్పందం కేవలం ప్రాజెక్టులకే పరిమితం కాకుండా, సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని పెంచేలా డిజైన్ చేశారు. టీసీఎస్‌లోని ఇంజినీరింగ్, ఫైనాన్స్, లీగల్, మార్కెటింగ్, సేల్స్ వంటి కీలక విభాగాలకు చెందిన సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ఆంథ్రోపిక్ 'క్లాడ్' టూల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది ఉద్యోగుల పనితీరులో మార్పు తీసుకురావడమే కాకుండా, క్లిష్టమైన పనులను సులభతరం చేసేందుకు ఏఐ ఏజెంట్లను ఉద్యోగులతో సమానంగా వినియోగించే స్థాయికి సంస్థను తీసుకెళ్లనుంది.
ఇది కూడా చూడండి:Ireland: : ఐర్లాండ్‌లో అల్లర్లు.. వలసదారులను లక్ష్యంగా చేసుకున్న హింస
ఆంథ్రోపిక్‌తో కలిసి టీసీఎస్ సంయుక్తంగా అనేక రంగాలకు అవసరమైన కస్టమ్ ఏఐ ఉత్పత్తులను రూపొందించనుంది. ముఖ్యంగా ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్, ఏవియేషన్, టెలికాం, మెడ్‌టెక్ వంటి రంగాలు ఈ భాగస్వామ్యం ద్వారా భారీగా లబ్ధి పొందనున్నాయి. క్లయింట్ సేవలను మరింత వేగవంతం చేయడం, వ్యాపార నిర్వహణలోని లోపాలను సరిదిద్దడం, మొత్తం ఉత్పాదకతను గణనీయంగా పెంచేలా ఈ ఏఐ పరిష్కారాలు పనిచేస్తాయి. ఆటోమేషన్ ప్రక్రియ ద్వారా క్లిష్టమైన వ్యాపార సమస్యలను పరిష్కరించడం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. ఈ భాగస్వామ్యంపై ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆరియో అమోడోయ్ స్పందిస్తూ.. భారత్‌తో కలిసి పనిచేయడానికి తమ సంస్థ ఎంతగానో ఆసక్తిగా ఉందన్నారు.
Follow Us