/rtv/media/media_files/2025/04/01/nGBZ6DK1FWkHppViVEst.jpg)
Smartphone Launch in April
2025లో మార్చి నెల పోయి.. నేటి నుంచి ఏప్రిల్ నెల మొదలైంది. ఒకరకంగా స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌కు మార్చి నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెలలో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ల వరదపారింది. Google, నథింగ్, iQOO వంటి అనేక పెద్ద కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లు Pixel 9a, Phone 3a సిరీస్, Neo 10Rలను మార్కెట్లో రిలీజ్ చేశాయి. దీంతో మార్చి నెలలో స్మార్ట్ఫోన్ల హవా కొనసాగింది.
అయితే ఏప్రిల్ నెల మరింత ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో అనేక ప్రధాన బ్రాండ్లు తమ కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. Motorola, Poco, iQOO, Vivo, నథింగ్ వంటి అనేక పెద్ద బ్రాండ్లు తమ మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Poco C71
Poco C71 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కాబోతుంది. ఇది బడ్జెట్ ఫోన్ అయ్యే అవకాశం ఉంది. తక్కువ ధరలో గొప్ప ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు కొత్త ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ 6.88 అంగుళాల HD + 120 Hz డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని ధర రూ.7000 వరకు ఉండే అవకాశం ఉంది.
Moto Edge 60 Fusion
Motorola నుంచి మరో Moto Edge 60 Fusion భారతదేశంలో ఏప్రిల్ 2న లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5K ఆల్-కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంది. అలాగే ఈ ఫోన్ 5500mAh బ్యాటరీతో వస్తుంది.
iQOO Z10 5G
iQOO కంపెనీ తన లైనప్‌లో ఉన్న iQOO Z10 5Gని లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 11వ తేదీన భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ 0.789 సెంటీమీటర్ల మందంతో భారతదేశంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా ప్రత్యక్షమవనుంది. అంతేకాకుండా 7300mAh శక్తివంతమైన బ్యాటరీతో అందించబడుతుంది.
Vivo T4 5G
Vivo తన T-సిరీస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T4 5Gని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ దాని ఫీచర్లు, లాంచ్ తేదీకి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే ఇది ఏప్రిల్ చివరిలో లాంచ్ కానున్నట్లు సమాచారం అందింది.
Poco F7 అల్ట్రా
Poco ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ Poco F7 అల్ట్రా ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ ఫోన్ ఏప్రిల్‌లో భారత మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్లో మీరు శక్తివంతమైన ప్రాసెసర్, IP68 రేటింగ్, 50MP ప్రైమరీ కెమెరా సౌకర్యాన్ని పొందుతారు.
Vivo V50e
Vivo తన V50 సిరీస్‌కి సంబంధించిన రెండవ మోడల్ Vivo V50eని ఈ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్ గురించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్‌లో ఇది లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది.
CMF ఫోన్ 2
నథింగ్ సబ్-బ్రాండ్ CMF స్మార్ట్‌ఫోన్ నుంచి త్వరలో CMF ఫోన్ 2 లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
( tech-news | telugu-news | telugu tech news | latest-telugu-news)