/rtv/media/media_files/2025/04/01/Cv5n3TD0ie1y8QEMprlB.jpg)
OnePlus 12 Offers
ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ మార్కెట్‌లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది. కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ మొబైల్ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా తన ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించి మరింత కస్టమర్లను తనవైపుకు తిప్పుకుంటుంది. తాజాగా మరో ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు ప్రకటించింది. OnePlus 12పై భారీ డిస్కౌంట్ ఇస్తుంది. Amazon గత సంవత్సరం లాంచ్ అయిన OnePlus ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. డిస్కౌంట్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ తగ్గింపులు కూడా పొందొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!
OnePlus 12 Offers
OnePlus 12 ఫోన్‌లోని హైవేరియంట్‌పై ఆఫర్ ఉంది. దీని 12GB RAM - 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.64,999 ఉండగా.. ఇప్పుడు రూ.51,998కి లిస్ట్ చేయబడింది. ఆసక్తిగల కస్టమర్లు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై ఫ్లాట్ రూ.6,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ బ్యాంక్ డిస్కౌంట్‌తో వన్‌ప్లస్ 12 ధర రూ.45,998 అవుతుంది. అలాగే దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
పాత ఫోను లేదా ఇప్పటికే వాడుతున్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల రూ.46,100 వరకు తగ్గుతుంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ మోడల్, దాని పెర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంటుంది. కాగా ఈ ఫోన్ జనవరి 2024లో రూ. 64,999 (12GB/256GB వేరియంట్)కి ప్రారంభించబడింది. అంటే మొత్తంగా ఈ ఫోన్‌పై దాదాపు రూ.19 వేల తగ్గింపు లభిస్తుంది.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
OnePlus 12 Specifications
OnePlus 12ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల పూర్తి HD ప్లస్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 1440x3168 పిక్సెల్‌లుగా ఉంది. కంపెనీ ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ని అందించింది. ఈ ఫోన్‌లో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5400 mAh బ్యాటరీ అమర్చారు. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP65 రేటింగ్‌ను కలిగి ఉంది.
ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్
కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 64 మెగాపిక్సెల్ రెండవ కెమెరా, 48 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇక ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికొస్తే.. ఇందులో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు అందించారు.