/rtv/media/media_files/2025/03/29/1srrDzIPoO1kTM9t5qf8.jpg)
Nubia Neo 3 5G, Neo 3 GT gaming smartphones launched
స్మార్ట్‌ఫోన్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మొబైల్స్ విడుదలై మంచి క్రేజ్ అందుకున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా మరో అద్భుతమైన మోడల్ మార్కెట్‌లోకి దిగింది. ZTE Nubia Neo 3 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది.
Also Read: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
అందులో Nubia Neo 3 5G, Nubia Neo 3 GT ఫోన్లు ఉన్నాయి. Nubia Neo 3 GTలో Unisoc T9100 చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో Nubia Neo 3 5G ఫోన్ Unisoc T8300 చిప్‌సెట్‌తో అమర్చబడింది. ఇది 8 GB RAM, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇప్పుడు వీటి ధరలు, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు తెలుసుకుందాం.
Also Read: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
Nubia Neo 3 5G Price
Nubia Neo 3 5G ఫోన్ రెండు కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది. ఇందులో ప్రారంభ వేరియంట్ 8 GB RAM, 128 GB స్టోరేజ్‌తో ఉంది. ఈ ఫోన్ ధర PHP 7,999 (సుమారు రూ. 12,000)గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 8GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ PHP 9,999 (సుమారు రూ. 15,000)కి వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను మూడు కలర్ వేరియంట్‌లలో విడుదల చేసింది. వీటిలో సైబర్ సిల్వర్, షాడో బ్లాక్, టైటానియం గోల్డ్ వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు LAZADAలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి.
Nubia Neo 3 5G ఫోన్ 6.8 అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్ట ప్రకాశం 1000 నిట్‌లుగా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో కంపెనీ 8GB ఫిజికల్ ర్యామ్, 12GB వర్చువల్ ర్యామ్‌తో సహా 20GB RAMకి మద్దతు ఇచ్చింది. అలాగే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంది.
Also Read: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు షాక్.. బహిష్కరిస్తున్నమంటూ మెయిల్స్!
Nubia Neo 3 GT Price
Nubia Neo 3 GT ఫోన్ సింగిల్ వేరియంట్‌లో ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. దీని 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర PHP 12,999 (సుమారు రూ. 19,000)గా ఉంది. ఇది ఎలక్ట్రో ఎల్లో, ఇంటర్‌స్టెల్లార్ గ్రే కలర్స్‌లో అక్కడ లాంచ్ చేయబడింది.
Also Read: మయన్మార్ లో పెరుగుతున్న మృతుల సంఖ్య..భారత్ 15 టన్నుల సహాయ సామాగ్రి
Nubia Neo 3 GT ఫోన్ 6.8-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ గరిష్ట ప్రకాశం 1300 నిట్స్‌గా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ Unisoc T9100 చిప్‌సెట్‌తో అమర్చబడింది. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
(new-smartphone | tech-news | telugu tech news | latest-telugu-news | telugu-news)