/rtv/media/media_files/2025/04/14/HXHCaWcNwya6bBsP4ggg.jpg)
Lucknow Supergiants scored 79 for 2 in 10 overs in today's match against Chennai Super Kings
ఐపీఎల్ 2025 సీజన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో జట్టు బ్యాటింగ్‌కు దిగింది. క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు.
ఆదిలోనే లఖ్‌నవూకు షాక్ తగిలింది. మార్‌క్రమ్ ఔట్ అయ్యాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 0.6 ఓవర్‌కు భారీ షాట్ ఆడాడు. అది కాస్త ఎడ్జ్ తీసుకోవడంతో రాహుల్ త్రిపాఠి సూపర్ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో తొలి ఓవర్ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది.
ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో పంత్ 29, బదోని 6* ఉన్నారు.