/rtv/media/media_files/2025/03/25/hPtZdBTC71HAdBzm5Jaj.jpg)
Lava Shark entry-level smartphone launched in India
భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మొబైల్ కంపెనీలలో లావా ఒకటి. కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ తన కంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల లావా SHARK సిరీస్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగానే షార్క్ అల్ట్రా-అఫార్టబుల్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఈ ఫోన్ దాని డిజైన్, లుక్‌తో అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ అనుభవాన్ని అందిస్తుందిని కంపెనీ తెలిపింది. ఇది టైటానియం గోల్డ్, స్టీల్త్ బ్లాక్ అనే రెండు అద్భుతమైన కలర్‌లలో లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర విషయానికొస్తే.. దీనిని రూ.6999లకే లావా రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు.
Lava Shark entry-level smartphone launched in India. It is part of the new Shark series.
— Anvin (@ZionsAnvin) March 25, 2025
Lava Shark specifications:
- 6.67-inch IPS LCD HD+ 120Hz display
- Unisoc T606 chip
- 4GB RAM | 4GB virtual RAM
- 64GB storage | microSD card slot
- 5,000mAh battery | 18W fast charging
-… pic.twitter.com/tmMs1WBkRo
Also Read: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
Lava Shark Specifications
లావా షార్క్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో ఫేస్ అన్‌లాక్ ఫంక్షన్ (0.68సె), భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (0.28సె) వంటివి అందించారు. అంతేకాకుండా వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం.. ఇది 50MP AI వెనుక కెమెరా, 8MP ముందు కెమెరాతో అమర్చబడింది.
Also Read: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!
ఇవి AI మోడ్, పోర్ట్రెయిట్, ప్రో మోడ్, HDR లకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ UNISOC T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4GB RAM, 64GB ఇంటర్నెల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది Android 14 పై నడుస్తుంది. అంతేకాకుండా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 158 నిమిషాలు పడుతుంది. బ్యాటరీ లైఫ్‌లో 45 గంటల టాక్ టైమ్, 376 గంటల స్టాండ్‌బై, 550 నిమిషాల YouTube ప్లేబ్యాక్ ఉంటాయి. ఇతర ఫీచర్లలో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.0, Wi-Fi వంటివి అందించారు.
( latest-telugu-news | telugu-news | tech-news | telugu tech news)