/rtv/media/media_files/2025/03/26/I1YjQ8kKLyK234p9hnSF.jpg)
Cybercrime Coordination Center Photograph: (Cybercrime Coordination Center )
డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సైబర్ క్రైం నివారించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాలో మొబైల్ యూజర్ల డిజిటల్ సేఫ్టీని కాపాడటానికి 7.8 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 83వేలకు పైగా వాట్సాప్ ఖాతాలు ఇండియన్ గవర్నమెంట్ బ్లాక్ చేసింది. అంతేకాదు 3వేలకు పైగా స్కైప్ ఐడిలను గుర్తించి వాటిని టెలికమ్యూనికేషన్ అధికారులు బ్లాక్ చేశారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ ఫ్రాడ్‌లను కట్టడి చేయడానికి ఈ చర్యలు తీసుకున్నారు. డిజిటల్ మోసాలపై కేంద్రం ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది.
Govt ramps up action on #Cybercrime. By Feb, 7.81 lakh #SIMcards & 83K+ #SocialMediaAccounts linked to #DigitalFraud were blocked. The 'Cybercrime Coordination Center #I4C' saved ₹4,386 crore for citizens through swift action on 13.36 lakh complaints. #CyberSecurity pic.twitter.com/A15ewTiMGg
— Newscast Pratyaksha (@NewscastGlobal) March 26, 2025
Department of Telecommunications (DoT) takes strong action against telecom fraud & misuse through Sanchar Saathi Portal with over 3.4 Crore mobile disconnections and 3.19 Lakh IMEI numbers blocked. pic.twitter.com/nPNOTfojOq
— DoT India (@DoT_India) March 25, 2025
సైబర్ నేరస్థులపై భారతదేశం కఠినమైన చర్యలు తీసుకుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు. స్పామ్ సిమ్ కార్డులను బ్లాక్ చేయడంతో పాటు ప్రభుత్వం 2,08,469 IMEI నంబర్‌లను కూడా నిలిపివేసింది. దొంగలించిన ఫోన్లతో మోసాలకు పాల్పడకుండా కంప్లైయింట్ అందిన IMEI నెంబర్ల సర్వీస్ హోల్డ్‌లో పెట్టారు.- అధికారులు ఇప్పుడు వీడియో కాలింగ్, మెసేజింగ్ యాప్‌లపై ఫొకస్ పెట్టారు. ప్రస్తుతం సైబర్ క్రైం చేయడానికి వీటినే ఆయుధాలుగా మార్చుకుంటున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇప్పటికే 3,962 స్కైప్ ఐడిలు, 83,668 వాట్సాప్ ఖాతాలు ఫేక్ అని గుర్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా స్పామ్ కాల్స్ గుర్తుస్తున్నారు. AI టూల్స్ ఉపయోగించి నిరంతరం ఆన్‌లైన్ మోసాలపై నిఘా పెడుతున్నారు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులు. సోషల్ మీడియా ద్వారా కూడా సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుతున్నారు.
Also read: Kunal Kamra: మరో వివాదంలో కునాల్ కామ్రా.. ఈసారి నిర్మలా సీతారామన్ టార్గెట్