/rtv/media/media_files/2026/04/06/artemis-ii-2026-04-06-19-03-25.jpg)
అంతరిక్ష పరిశోధనల్లో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దశాబ్దాల కాలంగా చెక్కుచెదరకుండా ఉన్న అపోలో 13 రికార్డును బద్దలు కొడుతూ, ఆర్టెమిస్ II మిషన్ నేడు చంద్రునికి అత్యంత దగ్గరగా వెళ్లనుంది. మానవ సహిత అంతరిక్ష యాత్రల్లో ఇంతటి సుదూర ప్రాంతానికి వెళ్లడం ఇదే మొదటిసారి కానుంది.
1970లో అపోలో 13 వ్యోమగాములు భూమి నుండి సుమారు 400,171 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు నాసాకు చెందిన ఓరియన్ అంతరిక్ష నౌక ఏకంగా 406,000 కిలోమీటర్ల దూరాన్ని చేరుకొరి ఆ పాత రికార్డ్ బ్రేక్ చేయనున్నారు. కెనడియన్ వ్యోమగామి జెరెమీ హాన్సెన్‌తో పాటు మరో ముగ్గురు అమెరికన్ సిబ్బంది ఈ అద్భుత చేసి చరిత్ర సృష్టించబోతున్నారు.
Artemis II is not just going "to the Moon," but rather traveling to meet it at an exact point in space.
— Massimo (@Rainmaker1973) April 6, 2026
It’s all about orbital mechanics. pic.twitter.com/Gy4Dy5k8t9
చంద్రుని అంచున.. నిశ్శబ్ద క్షణాలు:
ఈ ప్రయాణంలో ఓరియన్ స్పేస్‌షిప్ చంద్రుని వెనుక భాగానికి వెళ్ళినప్పుడు, చంద్రుని ఉపరితలం రేడియో సంకేతాలను అడ్డుకుంటుంది. దీనివల్ల సుమారు 40 నిమిషాల పాటు భూమితో సంబంధాలు తెగిపోయి 'సమచార ప్రసార నిలిపివేత' ఏర్పడుతుంది. ఆ తర్వాత, నౌక చంద్రుని ఉపరితలానికి కేవలం 6,500 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఆ ఎత్తు నుంచి చూస్తే చంద్రుడు చేతిలో పట్టుకున్న బాస్కెట్‌బాల్ అంత పరిమాణంలో కనిపిస్తాడని హాన్సెన్ ఉత్సాహంగా వివరించారు.
దాదాపు ఐదు గంటల పాటు వ్యోమగాములు చంద్రునిపై ఉన్న భారీ ఉల్కాపాత బిలాలు, పురాతన లావా ప్రవాహాలను నిశితంగా పరిశీలిస్తూ ఫోటోలు తీయనున్నారు. గతంలో అపోలో వ్యోమగాములకు చీకటి కారణంగా కనిపించని చంద్రుని అవతలి వైపు అద్భుత దృశ్యాలను వీరు చూడనున్నారు. ముఖ్యంగా 3.8 బిలియన్ ఏళ్ల నాటి భారీ బిలం ‘ఓరియంటల్ బేసిన్’ ఓరియన్ సమీపిస్తున్న కొద్దీ అత్యంత ప్రకాశవంతంగా కనిపిస్తుందని నాసా వెల్లడించింది. అపోలో 13 తరహాలోనే, ఆర్టెమిస్ II కూడా ఇంధన వినియోగం తగ్గించేందుకు భూమి, చంద్రుని గురుత్వాకర్షణపై ఆధారపడే 'ఎనిమిది ఆకారపు' మార్గంలో ప్రయాణిస్తోంది. ఈ మిషన్ చంద్రునిపై దిగనప్పటికీ, భవిష్యత్తులో చంద్రునిపై మానవ ఆవాసాలకు అవసరమైన కీలక సమాచారాన్ని సేకరిస్తుంది. ఫ్లోరిడా నుండి బయలుదేరిన ఈ నౌక, తొమ్మిది రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఏప్రిల్ 10న శాన్ డియాగో సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగనుంది.
Follow Us