Upcoming Smartphones: ఏప్రిల్ జాతర వచ్చేస్తుంది మావా.. తక్కువ ధరలో ఫోన్లే ఫోన్లు!

మార్చి నెలలో చాలా ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చేస్తోంది. పలు కంపెనీలు తమ మొబైల్స్‌ను లాంచ్ చేయనున్నాయి. అందులో Moto Edge 60 Fusion, Vivo V50e, poco f7 ఫోన్లు ఉన్నాయి. ఇవి రూ.30 వేల ధరలో ఏప్రిల్‌లో భారతదేశంలో రిలీజ్ కానున్నాయి.

New Update
Upcoming Smartphones

Upcoming Smartphones

భారతదేశం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. కొత్త కొత్త ఫోన్లు లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది మార్చి నెలలో చాలా ఫోన్లు లాంచ్ చేసి అందరినీ అట్రాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు మార్చి నెల ముగిసే సమయం వచ్చింది. మరో నాలుగు రోజుల్లో ఈ నెల పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో లాంచ్ కాబోయే ఫోన్ల గురించి చాలా మంది ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. 

Also Read: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

అదే సమయంలో ఏప్రిల్ నెల కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. విభిన్న బడ్జెట్‌లలో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ఫోన్‌లు ఏప్రిల్‌లో విడుదల కానున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా వివిధ పేర్లతో లాంచ్ అవుతాయి. అంతేకాకుండా భారతదేశంలో కూడా వేర్వేరు పేర్లతో లాంచ్ చేయబడతాయి. అందువల్ల భారతదేశం సహా ఇతర దేశాలలో ఏప్రిల్‌లో దాదాపు 16 స్మార్ట్‌ఫోన్‌లను ప్రారంభించే అవకాశం ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ జాబితాలో రూ. 30,000 వరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Moto Edge 60 Fusion

చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫోన్‌లలో మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఒకటి. ఇది ఏప్రిల్ ప్రారంభంలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.30 వేల లోపే ఉండే అవకాశం ఉంది. తాజా లీక్‌ల ప్రకారం.. Motorola Moto Edge 60 Fusionలో MediaTek Dimensity 7400 చిప్‌సెట్ అందుబాటులో ఉంటుందని తెలిసింది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌లో రిలీజ్ కాబోయే కొన్ని ఫోన్ల గురించి తెలుసుకుందాం. 

Vivo V50e

Vivo V50 E స్మార్ట్‌ఫోన్‌ను Vivo V50 సిరీస్ కింద ఏప్రిల్ మధ్యలో ప్రారంభించే అవకాశం ఉంది. దీని డిజైన్ చూస్తే Vivo S20 గుర్తుకు వస్తుంది. చేజ్ డిజైన్ మార్బుల్ ఫినిష్ లాగా ఉంటుంది. వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా అందించారు. Vivo VE50E భారతదేశంలో రూ.30 వేల ధరతో ఏప్రిల్‌లో లాంచ్ కాబోతుంది. 

poco f7

Poco F7 సిరీస్‌ను ఏప్రిల్ మధ్యలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో Poco F7, Poco F7 Pro, Poco F7 అల్ట్రా వంటి మోడల్స్ ఉన్నాయి. ఇందులో కేవలం Poco F7 మోడల్ మాత్రమే ఏప్రిల్‌లో భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ ఫోన్ 6.67 Qhd+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ఫోన్‌లో సపోర్ట్ చేస్తుంది. దీని ధర కూడా రూ.30 వేల వరకు ఉంటుంది.

(latest-telugu-news | telugu-news | tech-news | telugu tech news | upcoming-smartphones)

Advertisment
Advertisment
Advertisment