Amazon EPL Sale: ఇట్స్ IPL టైం.. అమెజాన్ EPL సేల్ స్టార్ట్- ఫోన్లు, టీవీలు, ప్రొజెక్టర్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

అమెజాన్ మరో కొత్త సేల్ ప్రకటించింది. ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్’ తీసుకొచ్చింది. మార్చి 26 వరకు కొనసాగుతుంది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్స్, ట్యాబ్‌లు వంటి ప్రొడెక్టులపై భారీడిస్కౌంట్లు అందిస్తోంది. తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.

New Update
Amazon Electronics Premier League Sale

Amazon Electronics Premier League Sale

అమెజాన్‌‌లో అదిరిపోయే బంపర్ సేల్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ (EPL) సేల్‌ను కొనసాగుతోంది. మార్చి 21 నుండి మార్చి 26 వరకు ఈ సేల్‌ ఉంటుంది. స్మార్ట్ టీవీలు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ప్రొజెక్టర్స్ వంటి అనేక ఎలక్ట్రానిక్ ప్రొడెక్టులపై భారీ తగ్గింపులను పొందవచ్చు. ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65% వరకు తగ్గింపు ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీనితో పాటు, మొబైల్ ఫోన్లు, సౌండ్ బార్‌లు మొదలైన ఇతర పరికరాలపై కూడా తగ్గింపు ఉంది. బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు, కంపెనీ నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు కూపన్ డిస్కౌంట్‌ల ద్వారా రూ.5,000 వరకు తగ్గింపు పొందవచ్చు. పలు ట్రాన్సక్షన్లపై రూ.5,250 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 

ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

స్మార్ట్‌టీవీపై డిస్కౌంట్లు

శామ్‌సంగ్ UA43DUE77AKLXL

Samsung నుండి UA43DUE77AKLXL స్మార్ట్ టీవీని అతి తక్కువ దరకే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ 43 ఇంచుల పరిమాణంలో వస్తుంది. ఇది కంపెనీకి చెందిన D సిరీస్ టీవీ. ఈ టీవీ బ్రైటర్ క్రిస్టల్ 4K డిస్ప్లేతో వస్తుంది. ఈ అల్ట్రా HD స్మార్ట్ టీవీపై కంపెనీ 37 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ టీవీని రూ.31,490కి కొనుగోలు చేయవచ్చు.

ఏసర్ AR55QDXGU2875AT

ఈ సేల్‌లో ఏసర్ 55 అంగుళాల టీవీని 53 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంపెనీకి చెందిన సూపర్ సిరీస్ టీవీ. 4K అల్ట్రా HD రిజల్యూషన్‌ను అందిస్తుంది. ఇది Google TVలో పనిచేసే QLED TV.  బ్లాక్ కలర్‌లో వస్తుంది. దీనిని రూ. 36,999 కు ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.

ఎల్జీ 32LR600B6LC

అమెజాన్ సేల్‌లో LG 32-అంగుళాల టీవీని 29 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఇది కంపెనీ LR60 సిరీస్‌లోని టీవీ. దీనికి IPS ప్యానెల్ ఉంది. ఈ సేల్‌లో LED టీవీని రూ.14,990కి కొనుగోలు చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్

ఐఫోన్ 15

ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో ఆపిల్ ఐఫోన్ 15 కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 23 శాతం తగ్గింపుతో లభిస్తుంది. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేను కలిగి ఉంది. 48MP ప్రధాన కెమెరాతో వస్తుంది. దీనికి A16 బయోనిక్ చిప్ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది రూ.61,900కు అందుబాటులో ఉంది.

ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

వన్‌ప్లస్ 13ఆర్

ఈ సేల్‌లో OnePlus 13R మొబైల్‌ని 12 GB RAM, 256 GB స్టోరేజ్‌తో 4 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 6000mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా ఉన్నాయి. ఇది ప్రస్తుతం అమెజాన్‌లో రూ.42,998కి లభిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ CE4 లైట్ 5G

OnePlus Nord CE4 Lite 5G తగ్గింపు ధరకు సేల్‌లో లిస్ట్ చేయబడింది. ఈ ఫోన్ 8GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను 14% తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది రూ. 17998 కు లభిస్తుంది.

టాబ్లెట్లపై డీల్స్

వన్‌ప్లస్ ప్యాడ్ గో

OnePlus Pad Go తగ్గింపు ధరకు సేల్‌లో జాబితా చేయబడింది. ఇది 2.4K రిజల్యూషన్‌తో 11.35-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ 8 GB RAM తో అందించబడింది. ఇది డాల్బీ అట్మోస్‌కు మద్దతును కలిగి ఉంది. 15% తగ్గింపుతో రూ.16,999 కు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

హానర్ ప్యాడ్ X9

హానర్ ప్యాడ్ X9 11.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ టాబ్లెట్ 2K డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. దీనిలో 8 GB RAM ఉంది. ఇది 13 గంటల బ్యాటరీతో వస్తుంది. దీనిని సేల్‌లో 46% తగ్గింపుతో రూ. 14,999 కు కొనుగోలు చేయవచ్చు.

ప్రొజెక్టర్లపై డిస్కౌంట్

Wanbo ప్రొజెక్టర్

Wanbo ప్రొజెక్టర్ ప్రారంభ ధర రూ. 49,990 ధరకు లిస్ట్ అయింది. ఇప్పుడు దీనిని అమెజాన్‌లో రూ. 28,990 ధరకు కొనుక్కోవచ్చు. అంటే సేల్ సమయంలో రూ. 21,000 తగ్గింపును పొందుతారు.

జీబ్రానిక్స్ ప్రొజెక్టర్

అమెజాన్‌లో జీబ్రానిక్స్ ప్రొజెక్టర్ ధర రూ.1,49,999 ఉండగా.. ఇప్పుడు రూ.69,999కి కొనుక్కోవచ్చు. అంటే రూ.80,000 తగ్గింపును పొందొచ్చు. ఇది పరిమిత కాల ఆఫర్.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

XGIMI ప్రొజెక్టర్

XGIMI ప్రొజెక్టర్‌ను రూ.84,999కి బదులుగా రూ.44,999కి పొందవచ్చు. అంటే ఈ సేల్‌లో రూ.40,000 ఆదా అవుతుంది.

 

(amazon-sale | smart-tv-offer | tv offers | mobile-offers | latest-telugu-news | today-news-in-telugu | technology | artificial-intelligence-technology)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Realme 13 Pro Offer: కిర్రాక్ డిస్కౌంట్.. రెడ్ మీ ఫోన్ పై రూ.8వేల తగ్గింపు- వెరీ చీప్!

అమెజాన్‌లో రెడ్‌మి 13ప్రో ఫోన్‌పై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8/128GB ధర రూ.26,999 ఉండగా ఇప్పుడు రూ.19,999కి లిస్ట్ అయింది. రూ. 1250 బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఇది రూ.18,749కి లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌తో మరింత తక్కువకే పొందొచ్చు.

New Update
Realme 13 Pro smartphone available on amazon is getting a discount of Rs.8000

Realme 13 Pro smartphone available on amazon is getting a discount of Rs.8000

తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అనుకుంటున్నారా?.. అలాంటి ఫోన్ కోసం ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రూ. 20 వేలలోపు కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు Realme 13 Pro మంచి ఆప్షన్. ప్రముఖ ఇ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఈ ఫోన్‌పై బ్లాక్ బస్టర్ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా భారీ బ్యాంక్ ఆఫర్‌లు కూడా పొందొచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆఫర్లు, పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

Realme 13 Pro Price

Realme 13 Pro పై ఆఫర్ లభిస్తుంది. ఇందులోని 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ గతేడాది జూలైలో విడుదలైనపుడు రూ.26,999కి లిస్ట్ అయింది. ఇప్పుడు ఇది అమెజాన్‌లో రూ. 19,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై ఫ్లాట్ రూ. 1250 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర రూ.18,749 అవుతుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.17,400 తగ్గింపును పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. పాత ఫోన్ మోడల్, కండీషన్ బట్టి ఎక్స్ఛంజ్ ధర నిర్ణయిస్తారు. 

Realme 13 Pro Specifications

Realme 13 Pro ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2412x1080 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Qualcomm Snapdragon 7S Gen2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా realme UI 5.0 OSలో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, Wi-Fi, USB టైప్ C పోర్ట్, బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉన్నాయి. అంతేకాకుండా 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో ఈ ఫోన్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.

ఇంకా వెనుక భాగంలో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

(mobile-offers | latest-telugu-news | telugu-news | redmi)

Advertisment
Advertisment
Advertisment