T20 World Cup: యూఎస్ మీద గెలిచిన భారత్..సూపర్ 8లోకి ఎంట్రీ

టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా సూపర్ 8 కు చేరుకుంది. యూఎస్‌ మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. అయితే పసికూనల మీద కూడా టీమ్ ఇండియా చెమటోడ్చి నెగ్గడం గమనించాల్సి విషయం.

New Update
T20 World Cup: యూఎస్ మీద గెలిచిన భారత్..సూపర్ 8లోకి ఎంట్రీ

టీ 20 ప్రపంచ కప్‌లో మొదట నుంచి దూకుడుగా ఆడుతున్న టీమ్ ఇండియా మూడో మ్యాచ్‌లో మాత్రం కష్టపడి గెలవాల్సి వచ్చింది. అది కూడా మొట్టమొదటిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వాళ్ళ మీద. గ్రూప్‌ ఏ లో ఈరోజు ఇండియా, యూఎస్‌ఏ టీమ్‌లో తలపడ్డాయి. ఇందులో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో మన జట్టు సూపర్ 8కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన యూఎస్‌ఏ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఈ టీమ్‌లో నితీశ్ కుమార్ 27 టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 4, హార్దిక్‌ 2, అక్షర్‌ ఒక వికెట్‌ తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్‌ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్య 50 నాటౌట్ తో అర్ధశతకం చేయగా, దూబె 31 పరుగులతో రాణించాడు. యూఎస్‌ఏ బౌలర్లలో సౌరభ్‌ 2, అలీ ఖాన్‌ ఒక వికెట్‌ తీశారు.

అమెరికాకు పెనాల్టీ..

మరోవైపు ఈ మ్యాచ్‌లో అమెరికా టీమ్‌కు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. భారత్‌ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొత్త ఓవర్‌ను ప్రారంభించడానికి మూడుసార్లు యూఎస్‌ఏ 60 సెకన్లు టైమ్ తీసుకుంది. దీనివలన ఓవర్లను పూర్తి చేయడానికి పెట్టిన నిర్ణీత సమయం కాస్త ఎక్కువ అయింది. దీంతో నిబంధనల ప్రకారం అమెరికాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించారు. 16వ ఓవర్ ప్రారంభం అయ్యే ముందు ఈ పరుగులను టీమ్ ఇండియా ఖాతాలో కలిపారు.

Also Read:Odisha: ఇది కదా ఆదర్శం అంటే..మాఝీ ప్రమాణస్వీకారానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్

Advertisment
Advertisment
తాజా కథనాలు