Team India: స్వదేశానికి చేరుకున్న విశ్వ విజేతలు! కరేబియన్ గడ్డ మీద జరిగిన ICC T20 వరల్డ్ కప్ 2024లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ తన జట్టుతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత బృందం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్‌లో బయల్దేరి గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. By Bhavana 04 Jul 2024 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Indian Cricket Team: ఎన్నో సంవత్సరాల కలను సాకారం చేసిన విశ్వ విజేతలు స్వదేశానికి చేరుకున్నారు. కరేబియన్ గడ్డ మీద జరిగిన ICC T20 వరల్డ్ కప్ 2024 లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్ (Rohit Sharma) తన జట్టుతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. గ్రాంట్లీ ఆడమ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి భారత బృందం బుధవారం చార్టర్ ఫ్లైట్‌లో ఢిల్లీకి బయలుదేరింది. ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ 24 ప్రపంచకప్ అనే ప్రత్యేక పేరుతో ఎయిర్ ఇండియా ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ గురువారం ఉదయం 6:20 కి దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) చేరుకుంది. #WATCH | #RishabhPant carrying the #T20WorldCup trophy at ITC Maurya Hotel in Delhi. 📹 ANI pic.twitter.com/pqOfUXqdX8 — Hindustan Times (@htTweets) July 4, 2024 బెరిల్ తుఫాన్ కారణంగా భారత జట్టు బార్బడోస్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు, సహాయక సిబ్బంది, ఆటగాళ్ల కుటుంబాలు, బోర్డు అధికారులు, ట్రావెలింగ్ మీడియా బృందం సుమారు 2 రోజులు పాటూ వేచి చూసిన తరువాత తరువాత వాతావరణం అనుకూలంగా మారడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి చార్టర్ విమానాన్ని ఏర్పాటు చేసింది. బార్బడోస్‌లో చిక్కుకున్న భారతీయ జర్నలిస్టులు, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జే షాతో కలిసి అదే విమానంలో ఎక్కారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. The T20 World Cup-winning Indian cricket team landed in Delhi on Thursday aboard a specially-arranged charter flight, five days after winning the coveted title in Barbados where it was stranded due to a category 4 hurrican.@BCCI @T20WorldCup #teamindia #t20worldcup #champions… pic.twitter.com/cJIcKudbSX — RTV (@RTVnewsnetwork) July 4, 2024 ప్రపంచ కప్ స్వదేశానికి చేరుకున్న వీడియో ను ఇప్పటికే బీసీసీఐ (BCCI) తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఒక చిన్న వీడియో పోస్ట్ చేసింది. విమానం టెర్మినల్ 3 దగ్గరకు వచ్చే సమాచారంతో అక్కడ ఆటగాళ్ళ కోసం అధికారులు ప్రత్యేక బస్సును నిలిపి ఉంచారు. ఈ నేపథ్యం లో విమానాశ్రయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. Also Read: కరకట్ట పై ఫైళ్ల దహనం..కొన్నిటిపై వైసీపీ నేత ఫోటోలు! #delhi #rohit-sharma #t20-world-cup-2024 #team-india #bcci మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి