క్లాస్ రూమ్ లోనే దారుణంగా తన్నుకున్న టీచర్లు.. వీడియో వైరల్ ఉత్తర కేరళ జిల్లా ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఉపాధ్యాయులు తన్నుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఒక చిన్న విషయంలో ఈ గొడవ మొదలవగా క్లాస్ రూమ్ లోనే బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. By srinivas 16 Nov 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే ఈ మధ్య చాలా చెండాలంగా వ్యవహరిస్తున్నారు. పసి బాలలను విచక్షణ రహితంగా కొట్టడంతోపాటు మరికొన్ని చోట్ల బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఇదిలావుంటే.. రీసెంట్ గా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఓ చిన్న ఇష్యూలో భాగంగా క్లాస్ రూమ్ లోనే దారుణంగా తన్నుకున్నారు. పిల్లలముందే బూతులు తిట్టుకుంటూ చోక్కాలు చించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. A crazy fight broke out between teachers during a staff meeting in a primary #school at #kozhikode. 5 people injured. Great example for childrens 🙄#Kerala #keralapolice #teacher pic.twitter.com/oJxJMcajX2 — Manu (@manureporting) November 14, 2023 ఇక అసలు విషయానికొస్తే.. ఉత్తర కేరళ జిల్లా ఎరవన్నూరులోని ఏయూపీ స్కూల్‌లో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఎరవన్నూరు పాఠశాలలో ఓ మీటింగ్ నిర్వహించారు. అయితే అదే స్కూల్ లో పనిచేస్తున్న భార్య మరో స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్న భర్త ఎంపీ షాజీని ఆహ్వానించింది. ఈ క్రమంలో అదే స్కూల్ కు చెందిన ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదును ఎంపీ షాజీ చైల్డ్‌లైన్‌కు ఫార్వర్డ్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. అయితే ఈ విషయం గమనించిన ఆ స్కూల్ టీచర్లు ఎందుకు ఇలా చేశారని మీటింగ్‌లో షాజీ భార్యను నిలదీశారు. ఆ సమయంలో భార్యను పికప్ చేసుకునేందుకు స్కూల్‌కు వచ్చిన అతను.. ఆ మీటింగ్‌లో ఉన్న టీచర్లతో ఘర్షణకు దిగాడు. దీంతో వాదనలతో మొదలైన గొడవ కొట్టుకునేదాకా వెళ్లింది. ఎంతమంది ఆపిన ఆగకుండా దారుణంగా చొక్కాలు చించుకుని దాడులు చేసుకున్నారు. Also read : భారత్ లో రెండుచోట్ల భూకంపం.. భయం గుప్పిట్లో ప్రజలు అయితే ఆ ఘటనలో ఏడుగురు టీచర్లకు గాయాలవగా షాజీని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీ 332, 506, 294 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్థానిక కోర్టు ముందు అతన్ని హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఈ ఘటన టీచర్లకు చెడ్డ పేరు తీసుకురావడంతో శాఖాపరమైన దర్యాప్తునకు అధికారులు ఆదేశించినట్లు చెప్పారు. నిజానికి ఈ ఘటన గత వారమే జరిగినా ఆ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా ఆ టీచర్లను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. #kerala #teachers #fighting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి