AP : అనపర్తి లో రగులుతున్న టీడీపీ అసంతృప్తి జ్వాలలు! అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది. By Bhavana 11 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Anaparthy : ఏపీ(Andhra Pradesh) లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసంతృప్తి జ్వాలలు బయటపడుతున్నాయి. అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి(NDA Alliance) అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది. అనపర్తి ఎన్డీయే కూటమి అభ్యర్థి శివరామకృష్ణంరాజు(Shiva Ramakrishna Raju) బుధవారం బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం మొదలు పెట్టాలని భావించారు అందులో భాగంగా ఆయన పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ- జనసేన- బీజేపీ కండువాలు ధరించి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో అనపర్తి టికెట్ వస్తుందని ఎంతగానో ఆశపడ్డ మాజీ ఎమ్మెల్యే రామ కృష్ణారెడ్డి ఆయనను అడ్డగించి ఆయన మెడలో టీడీపీ(TDP) కండువా ధరించడానికి వీల్లేదంటూ బలవంతంగా కండువా తీయించారు. ప్రస్తుతానికి కూటమి ప్రకటించిన అభ్యర్థిని అని శివరామ కృష్ణంరాజు ఎంత చెప్పినా టీడీపీ జెండాతో ప్రచారం చేయటం కుదరదని మాజీ ఎమ్మెల్యే రామ కృష్ణారెడ్డి అన్నారు. ఇక, ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో పలువురు బీజేపీ పరిస్థితి కూటమిలో ఇంత దారుణంగా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షరాలు పురందేశ్వరి బీజేపీ(BJP) ని ఇంత దారుణంగా తయారు చేసిందా అని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై పురందేశ్వరి రాష్ట్ర కన్వీనర్లు చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివరామ కృష్ణంరాజు వేసుకున్న టీడీపీ కండువాని బలవంతంగా తొలగించడంతో జనసేన- బీజేపీ కండువాలతో ఆయన ప్రచారం కొనసాగించారు. Also read: ”నాకు మార్కులు వేయకపోతే.. మా తాతతో చేతబడి చేయిస్తా”..పదో తరగతి విద్యార్థి మాస్ వార్నింగ్! #ycp #tdp #bjp #ap #janasena #politics #anaparthy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి